తొలి సారి మెగా ఫోన్ ప‌డుతున్న క్రేజీ స్టార్‌!

Update: 2023-01-15 00:30 GMT
విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు త‌మిళ స్టార్ ధ‌నుష్‌. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు వెళ్లిన ఈ వెర్స‌టైల్ స్టార్ రీసెంట్ గా తిరు మూవీతో వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డం తెలిసిందే. త‌న సోద‌రుడు, ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ తో క‌లిసి చాలా రోజుల త‌రువాత `నానే వ‌రువేన్‌`. ఇదే మూవీని తెలుగులో `నేనే వ‌స్తున్నా` అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. హార‌ర్ సైకో పాథ్ గా తెర‌కెక్కిన ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ అనూకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఇదిలా వుంటే ఈ ఏడాది ధ‌నుష్ తెలుగు ద‌ర్శ‌కుడితో చేస్తున్న `సార్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ , శ్రీ‌క‌ర స్టూడియోస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా అత్యంత భారీ స్థాయిలో ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేస్తున్నారు.

ఈ మూవీతో పాటు `కెప్టెన్ మిల్ల‌ర్‌`లో న‌టిస్తున్న ధ‌నుష్ త్వ‌ర‌లో మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నాడ‌ని తెలిసింది. ఓ ప‌క్క హీరోగా విభిన్న‌మైన సినిమాల్లో న‌టిస్తూనే హీరో ధ‌నుష్ వండ‌ర్ బార్ ఫిలింస్ బ్యాన‌ర్ పై నిర్మాత‌గా కొత్త త‌ర‌హా సినిమాలు నిర్మిస్తూ వ‌స్తున్నారు. కాక‌ముట్టై, విసార‌ణై వంటి సినిమాల‌ని నిర్మిస్తూ జాతీయ స్థాయిలోనూ నిర్మాత‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ధ‌నుష్ ఓ క్రేజీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడ‌ని తెలిసింది.

న‌లుగురు హీరోల నేప‌థ్యంలో ఓ వినూత్న‌మైన స్టోరీతో ఓ మూవీకి ధ‌నుష్ శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌ట‌. ఇందులో త‌న‌తో పాటు విషు, ఎస్‌.జె. సూర్య‌, కాళిదాసు జ‌య‌రాం న‌టించ‌నున్న‌ట్టుగా కోలీవుడ్ స‌మాచారం. త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు `రాయ‌న్‌` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ వినూత్న‌మైన సినిమాని స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ నిర్మించ‌నున్నార‌ట‌. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ని త్వ‌ర‌లోనే అధికారికంగా స‌న్ పిక్చ‌ర్స్ వారు ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News