మలయాళం స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్.. గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదనే చెప్పాలి. ఇటీవలే 'అనుకోని అతిథి' అనే డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ త్వరలోనే పాన్ ఇండియా వైడ్ పరిచయం కాబోతున్నాడు. నిజానికి ఫాహద్ తెలుగు తప్ప మిగతా దక్షిణాది భాషలు తమిళ, కన్నడ భాషల్లో పాపులర్ యాక్టర్. తన టాలెంట్ తో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఫాహద్ కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ పుష్పతో దర్శనమివ్వనున్నాడు. పుష్పలో ఫాహద్ ఓ ఇంపార్టెంట్ విలన్ రోల్ చేస్తున్నాడు.
అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఢీకొనే క్యారెక్టర్ తో ఫాహద్ తెలుగులో డెబ్యూ చేయబోతున్నాడు. ఇంతవరకు ఫాజిల్ నటన గురించి మలయాళం, తమిళం ప్రేక్షకులకే తెలుసు. పుష్పతో తెలుగుతో పాటు ఇతర భాషల వారు కూడా చూడనున్నారు.
పుష్ప సినిమాలో తన క్యారెక్టర్ చాలా ఫ్రెష్ గా.. తను ఇంతవరకు చేయని డిఫరెంట్ రోల్ ఇది' అని చెప్పి ఇటీవలే ఆసక్తి పెంచేసాడు. అయితే తాజాగా తానొక పెను ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు స్వయంగా తెలిపి షాకిచ్చాడు. పుష్పతో పాటు ఫాహద్ 'మలయాన్ కుంజు' అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తు నుండి కిందపడి అదృష్టవశాత్తు ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు తెలిపాడు. తలకు దెబ్బ తగలకుండా చేతులు అడ్డు పెట్టడం వలన తలకు ప్రమాదం తప్పిందని.. కానీ ఈ ప్రమాదంలో తన ముక్కుకు గాయమై మూడు కుట్లు కూడా పడ్డట్లు చెప్పాడు. అలాగే తానిప్పుడు రెస్ట్ లో ఉన్నానని సోషల్ మీడియా లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఫాహద్ నటించిన మాలిక్ సినిమా డిజిటల్ రిలీజుకు రెడీగా ఉంది. మొన్నటివరకు ఫాహద్ మాలిక్ సినిమా ఓటిటి రిలీజ్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజాగా లేఖలో తాను మాలిక్ డిజిటల్ రిలీజ్ విషయంలో సంతృప్తిగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు.