మరోసారి తెరపైకి స్టార్ కపుల్.. లేడీ డైరెక్టర్ తో!

Update: 2021-02-06 03:30 GMT
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. వీరిద్దరి సినిమాలు మొదటి నుండి తెలుగులోకి అనువాదం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అలా ఇద్దరూ కలిసే ప్రేమలో పడి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా పాపులర్ అయ్యారు. అయితే సూర్యతో పెళ్లి తర్వాత జ్యోతిక వేరే హీరోలతో సినిమాలు చేయడం తగ్గించింది. అయితే తాజాగా మరోసారి ఈ కపుల్ కలిసి నటించే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ తమిళ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ సరైన స్క్రిప్ట్ గురించి ఎదురు చూస్తున్నారట.

అయితే తాజా సమాచారం ప్రకారం.. సూర్య, జ్యోతికలు ఇటీవల 'నారింజ మిఠాయి' అనే సినిమా తెరకెక్కించిన హలితా షమిమ్ దర్శకత్వంలో చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నారింజ మిఠాయి అనేది తమిళ 'సిల్లు కరుపట్టి' అనే సినిమాకు తెలుగు డబ్బింగ్. ఇటీవలే ఆహా ఓటిటిలో విడుదలైంది. అయితే సిల్లు కరుపట్టి సినిమాకు సూర్య సమర్పకుడు. ఆ సినిమా టైంలో హలితా వర్క్ నచ్చి ఓ కథ రెడీ చేయమని చెప్పాడట. అందులో తన భార్య జ్యోతికకు కూడా అవకాశం ఉండాలని చెప్పినట్లు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా డైరెక్టర్ హలితా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మొదట్లో సూర్య ఊరికే అన్నాడు అనుకోని మళ్లీ రియాలైజ్ అయ్యిందట. ప్రస్తుతం హలితా సూర్య కపుల్ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తుందట. ఇక తాజాగా ఆమె తెరకెక్కించిన ఆలేయ్ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కాబోతున్నట్లు సమాచారం.


Tags:    

Similar News