బాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్ మరియు విక్కీ కౌశల్ లు పెళ్లికి సిద్దం అయ్యారు. వీరి ప్రేమ గురించి సుదీర్ఘ కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారు ఆ వార్తలు కొట్టి పారేయకుండా మౌనంతో అంగీకరించారు .ఆ తర్వాత ఇద్దరు కలిసి పలు పార్టీలకు పబ్ లకు హాజరు అవుతూ ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అంటూ మరింత క్లారిటీ ఇచ్చారు. ఒకటి రెండు సార్లు తమ రిలేషన్ ను బయట పెట్టకుండా స్నేహితులం మాత్రమే అని చెప్పే ప్రయత్నం చేశారు. కాని ఇద్దరు కూడా ఉన్న క్లోజ్ తో పాటు ఇద్దరి సన్నిహితుల ద్వారా వచ్చిన సమాచారం తో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలిసింది. అంతా అనుకున్నట్లుగానే మీడియాలో వచ్చిన వార్తల అనుసారంగానే ఇద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.
విక్కీ కౌశల్ మరియు కత్రీనాల పెళ్లి తంతు రెండు విభిన్నమైన పద్దతుల్లో జరుగుతుందని సమాచారం అందుతోంది. మొదటగా ముంబయిలోనే రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరుగనుంది. అక్కడ దండలు మార్చుకుని ఉంగరాలు మార్చుకుంటారు. సంతకాలు చేసి పెళ్లి తంతు ముగించుకుని అక్కడ నుండి అటే చర్చి లో పెళ్లి తంతు ముగిస్తారట. ఆ తర్వాత పెళ్లి ని రాజస్థాన్ కు షిప్ట్ చేస్తారు. సంగీత్ తో మొదలుకుని రెండు మూడు రోజుల పెళ్లి హడావుడి చేయబోతున్నారు. సంగీత్ కార్యక్రమం కోసం అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సంగీత్ లో విక్కీ కౌశల్ తో కలిసి కత్రీనా అయిదు ఆరు పాటలకు డాన్స్ వేయబోతుంది. ఆమె డాన్స్ సంగీత్ కార్యక్రమంకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. పెళ్లి కూతురు గా ఆమె వేయబోతున్న డాన్స్ ఎలా ఉంఉటందో చూడాలనే ఆశతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
పెళ్లికి సంబంధించిన వీడియోలు లీక్ అవ్వడం కాని.. మీడియాలో టెలికాస్ట్ అవ్వడం కాని జరగదని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ కి వీరి పెళ్లి డిజిటల్ రైట్స్ ను ఏకంగా 100 కోట్లకు అమ్మేసినట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ మొత్తంలో సినిమా కు సంబంధించిన హక్కులు కూడా అమ్ముడు పోవు కదా.. కాని విక్కీ కౌశల్ మరియు కత్రీనాల పెళ్లి తంతు ను చూసేందుకు కోట్ల మంది ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఆ ఓటీటీ వారు ఏకంగా వంద కోట్లకు ఈ డీల్ ను క్లోజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఆ ఓటీటీ లో లైవ్ స్ట్రీమింగ్ అవ్వబోతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈమద్య కాలంలో స్టార్స్ క్రిస్టియన్ మరియు హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని ఏకం అవుతున్నారు. అందుకే వీరు కూడా రెండు పద్దతుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు.