స్టార్ డైరెక్టర్ మరీ కమర్షియల్ అయినట్లున్నాడు...!

Update: 2020-08-14 05:00 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నాడట. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే ఆ డైరెక్టర్ ఇప్పుడు మరీ కమర్షియల్ గా ఆలోచిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సదరు డైరెక్టర్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అదే క్రమంలో స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నాడు. ఇప్పటి వరకు అతను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా హిట్ అందుకొని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. అందుకే ఇండస్ట్రీలోని ప్రతి హీరో కూడా ఈ పరాజయం ఎరుగని దర్శకుడితో ఒక్క సినిమా అయినా చేయాలి అని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో సినిమా రూపొందిస్తున్న ఆయన మరో స్టార్ హీరో ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టాడు. అయితే కొన్ని సినిమాలు తీసి రిటైర్ అయిపోవాలనుకుంటున్న ఆ స్టార్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ విషయంలో కొత్త కండిషన్స్ పెడుతున్నారట. సినిమా స్టార్ట్ అవకముందే అడ్వాన్స్ గా 15 కోట్లు ఇవ్వాలని.. అప్పుడే అగ్రిమెంట్ చేసుకుందామని చెప్తున్నాడట. అంతేకాకుండా తాను డైరెక్ట్ చేయబోయే సినిమాకు సంబంధించిన అన్ని రకాల బిజినెస్ లలో 30 శాతం షేర్ ఇవ్వాలని కూడా కండిషన్ పెడుతున్నాడట. వీటికి అంగీకరిస్తేనే ప్రాజెక్ట్ కి సైన్ చేస్తానని సదరు డైరెక్టర్ చెప్పేస్తున్నాడట. ఏదేమైనా క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే కాన్సెప్ట్ బాగా వంటబట్టించుకున్నాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.


Tags:    

Similar News