ఒకపక్క సాహో ఫినిషింగ్ తో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీని పూర్తి చేయడంలో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ ఆ తర్వాత ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ తో ఓ సినిమా చేస్తాడని గత రెండు మూడు రోజులుగా ప్రచారం ఊపందుకుంది. ఇది నిజమైతే బాగుండని ఫాన్స్ కూడా కోరుకున్నారు. ఇండియన్ 2 ముందుకు సాగుతుందా లేదా అనే అనుమానాలు వస్తున్న నేపద్యంలో ఈ టాక్ కి రెక్కలు వచ్చాయి. అయితే శంకర్ టీం నుంచి దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.
ప్రభాస్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినట్టు వస్తున్న వార్తలన్నీ అబద్దమని శంకర్ కు ప్రస్తుతం ఇండియన్ 2 తప్ప ఇంకో లోకం లేదని గాసిప్స్ కి చెక్ పెట్టేసింది. సో ప్రభాస్ కమిట్ అయిన పైన రెండు సినిమాలు తప్ప కొత్త ఆలోచనలు లేవని తెలినట్టే. నిజానికి శంకర్ తో చేయాలని మన స్టార్ హీరోలు చాలాసార్లు తపనపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా పబ్లిక్ స్టేజి మీద తన ఆకాంక్షను వెలిబుచ్చారు. అయినా శంకర్ టాలీవుడ్ లో కాలు మోపే ఆలోచన చేయలేదు.
ఇండియన్ 2 నిర్మిస్తున్న లైకా సంస్థ బడ్జెట్ విషయంలో నియంత్రణ పెట్టిందని అగ్రిమెంట్ మీద సైన్ పెట్టాలని కోరిందని వచ్చిన వార్తల గురించి మాత్రం శంకర్ టీం స్పందించడం లేదు. నిజమని ఒప్పుకోవడం కాని అబద్దమని కొట్టిపారేయడం కాని జరగలేదు. మొత్తానికి ఇండియన్ 2 ఆగిపోలేదన్న సంకేతం అయితే వచ్చింది. కమల్ ఎన్నికల దారుణ పరాజయం తర్వాత ఎలాగూ ఫ్రీ అయ్యాడు. ఇక షూటింగ్ జరగడమే ఆలస్యం