ఒకరి క్రియేటివిటీలో ఇంకొకరు వేలు పెడితే కోపం నషాలానికి ఎక్కుతుంది. అలాంటి కోపంతో ఊగిపోతున్నా ఇద్దరు కుర్ర దర్శకులు మాత్రం దానిని తమ సీనియర్ డైరెక్టర్ వద్ద దాచలేక నలిగిపోతున్నారట. తగుదునమ్మా అని ఆయన ఫింగరింగ్ లేనిదే పనవ్వని ఇరకాట పరిస్థితి ఉంది.
పైగా ఆ ఇద్దరు కుర్ర దర్శకులు తీసే సినిమాలను పర్యవేక్షించాల్సిందిగా హీరోగారే ఆ స్టార్ డైరెక్టర్ ని నియమించడంతో చేసేదేం లేక గమ్మున ఉన్నారట. అతడిపై చిరాకు పరాకు ఉన్నా ఏదీ బయటపడకుండా దాచేసుకుంటున్నారట సదరు యువదర్శకులు.
ఇద్దరు యువ దర్శకులు వేర్వేరు నిర్మాతల క్రింద రెండు వేర్వేరు ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. కాని రెండు సినిమాలకు ఉమ్మడి కనెక్షన్ ఆ హీరోగారు.. అదే స్టార్ డైరెక్టర్ ప్రమేయం వెనుక కారణం. దీంతో క్రియేటివ్ పార్ట్ లో ఆయన ఫింగరింగ్ శ్రుతి మించుతోందట.
పెద్ద సక్సెస్ ఉన్న స్టార్ డైరెక్టర్ దిద్దుబాట్లకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నిర్మాతలకు కానీ యువ దర్శకులకు కానీ అస్సలు ధైర్యం లేదు. పైగా హీరోకి ఆ స్టార్ డైరెక్టర్ చాలా క్లోజ్. హీరోకి విధేయత చూపాల్సిన యువ దర్శకులకు వేరే మార్గం లేకపోవడంతో మౌనంగానే ఉన్నారు. హిట్లొస్తే ఓకే కానీ.. రాకపోతే మాత్రం ఆ స్టార్ డైరెక్టర్ ఫింగరింగ్ పైనే వేలెత్తి చూపించే ఛాన్స్ ఉంది. అలాగే సదరు స్టార్ డైరెక్టర్ యువదర్శకుల్ని బ్లేమ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు కానీ హీరోకి అర్థం కాదు అసలు సంగతి.