సంఘంలో సింహంలా తిరిగేవాళ్లు కూడా వీధిలో కుక్కకు భయపడిపోతారు. చేలోకి వెళితే పాములు కరుస్తాయని భయపడే వాళ్లున్నారు. ఊరిలో పెద్ద మనుషులం అని చెప్పుకుని తిరిగేవాళ్లు చీకట్లో ఇంటెనక్కి వెళ్లేందుకు భయపడతారు.. ఇలా ఉంటుంది ఈ లోకం.
ఇక్కడ ఈ బడా మాఫియా సినిమాల డైరెక్టర్ ని చూస్తుంటే అయ్యో పాపం అనిపించడం లేదూ? సూది మందుకే ఆయన అంత పరేషాన్ అయిపోతున్నారు. వ్యాక్సినేషన్ వేస్తుంటే అసలు సూది తనకు కనిపించకుండా ఆ కళ్లను అలా మూసేసుకుని దూరంగా జరిగాడు. ఇంతకీ ఈయన ఎవరు? అంటారా? ది గ్రేట్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ చిత్రంతో సంచలనాలు సృష్టించిన ఆయన ప్రస్తుతం సీక్వెల్ ని పెద్ద రేంజులో రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. అతడు తెరకెక్కించినవి భారీ మాఫియా సినిమాలు. తాడిని తన్నేవాడొకడొస్తే వాడి తలదన్నేవాడొకడొస్తాడు! అంటూ చాలా పెద్ద సందేశమే ఇచ్చాడు. మరి ఆయనేమో ఇలా వ్యాక్సిన్ వేస్తుంటే కళ్లు మూసేసుకున్నారేమిటి అంటూ ఆటపట్టిస్తున్నారు జనం.
నిజానికి సూది మందు అంటే చాలా మందికి భయం. అందరిలోనూ ఆయనా ఒకడు. కానీ ఈ ఫన్ మూవ్ మెంట్ అరుదైనది అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సూదికి భయపడినా ఫర్వాలేదే కానీ కేజీఎఫ్ లాంటి భారీ మాఫియా యాక్షన్ సినిమాల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దని సూచిస్తున్నారు. ప్రభాస్ ని సలార్ లో భారీ బంధిపోటుగా చూపిస్తున్నాడని యాక్షన్ పీక్స్ లో ఉంటుందని టాక్ ఉంది. మరి టీజర్ చూపిస్తాడేమో చూడాలి.