టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ స్టార్ హీరోని కదిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజి హీరోల వరకు పాన్ ఇండియా మూవీస్ అంటూ హల్ చల్ చేస్తున్నారు. త్వరలో మీడియం రేంజి హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కు ప్లాన్ కూడా చేసుకుంటున్నాయి. ఇప్పటికే మా సినిమా కూడా పాన్ ఇండియానే అంటూ కొంత మంది యంగ్ హీరోలు ప్రకటించారు కూడా. కానీ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాత్రం పాన్ ఇండియా మాట ఎత్తడం లేదు.
క్రిష్ డైరెక్షన్ లో `హరి హర వీరమల్లు` మూవీ చేస్తున్న పవన్ కల్యాణ్ ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ తరువాత మాత్రం పవన్ నుంచి రానున్న సినిమా మాత్రం పాన్ ఇండియా కాదని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని డైరెక్టర్ స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల `భీమ్లానాయక్` తో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవర్ స్టార్.
ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది. హిందీలోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామంటూ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ తరువాత ఎలాంటి చప్పుడు లేదు. అప్ డేట్ అంతకన్నా లేదు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` మూవీ చేస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీ చిత్రీకరణ లో వుండగానే హరీష్ శంకర్ తో ఓ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
`భవదీయుడు భగత్ సింగ్` పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించబోతున్నారు. గత కొంత కాలంగా సందిగ్ధంలో వున్న ఈ ప్రాజెక్ట్ పై డైరెక్టర్ ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు హరీష్ శంకర్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన దగ్గరి నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది.
అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు నుంచి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, 80 శాతం చిత్రీకరణ హైదరాబాద్ లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
సినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపిస్తారని సర్ ప్రైజింగ్ విషయాన్ని వెల్లడించిన హరీష్ శంకర్ ఈ మూవీ పాన్ ఇండియా కాదని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఇదేంటీ హరీష్ శంకర్ ఇలా చేస్తున్నాడని అవాక్కవుతున్నారట. ప్రతీ హీరో పాన్ ఇండియా అంటుంటే మాది పాన్ ఇండియా మూవీ కాదని హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం పవన్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేస్తోందట.