ఇది పోతే ఇక ఆ డైరెక్ట‌ర్‌ కెరీర్ ముగిసిన‌ట్టేనా?

Update: 2022-09-08 08:30 GMT
ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కే విలువ ఎక్కువ‌. ఇక్క‌డ స‌క్సెస్ వుంటేనే అన్నీ.. అది ఎప్పుడైతే దూర‌మ‌వుతుందో ఒక్క‌సారిగా స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోతాయి. అప్ప‌టి వ‌ర‌కు చుట్టూ వున్న‌వారు క‌నుచూపు మేర దూరంలో కూడా క‌నిపించ‌రు. ప‌ల‌క‌రించే వారే వుండ‌రు.. ప‌ట్టించుకునే వారే వుండ‌రు.. డేట్స్ ఇచ్చే హీరో కూడా ముఖం చాటేస్తాడు.

ఇప్ప‌డు ఇదే త‌ర‌హా ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ఒక‌నాటి స్టార్ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల‌. గ‌తంలో వ‌రుస‌గా స్టార్ హీరోల‌తో బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ లు, బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందించారు.

నీ కోసం, ఆనందం, ఢీ, దుబాయ్ శీను, దూకుడు వంటి హిట్ లు, సూప‌ర్ హిట్ లు, బ్లాక్ బ‌స్ట‌ర్ లు శ్రీ‌ను వైట్ల ఖాతాలో వున్నాయి. ఆకాష్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వ‌ర‌కు ప్ర‌తీ హీరోతో క‌లిసి వ‌ర్క్ చేసిన శ్రీ‌ను వైట్ల గ‌త కొంత కాలంగా భారీ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ త‌న ఫామ్ ని కోల్పోయాడు. 'ఆగ‌డు' మూవీ నుంచి శ్రీ‌ను వైట్ల డిజాస్ట‌ర్ ల ప‌రంప‌ర 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ' వ‌ర‌కు సాగింది. దీంతో అత‌నితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డానికి ఏ హీరో ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

స్టార్ హీరోలు రీసెంట్ గా త‌న ట్రాక్ రికార్డ్ ని ప‌రిగ‌ణ‌లోరి తీసుకుని అవ‌కాశం ఇవ్వ‌డానికి ముఖం చాటేస్తుండ‌టంతో శ్రీ‌ను వైట్ల చిన్న హీరోల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాడ‌ట‌. అయితే చిన్న హీరోలు, టైర్ టు హీరోలు కూడా శ్రీ‌ను వైట్ల‌ని ప‌ట్టించుకోలేద‌ని, చాలా మంది తిప్పించుకుని ఆ త‌రువాత ముఖం చాటేశార‌ని ఇన్ సైడ్ టాక్‌.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీను వైట్ల మొత్తానికి ఓ హీరోని ఒప్పించాడ‌ని తెలిసింది. ఆ హీరో మ‌రెవ‌రో కాదు గోపీచంద్‌. శ్రీ‌ను వైట్ల చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో గోపీచంద్ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. గోపీచంద్ రీసెంట్ గా 'ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌' మూవీతో ఫ్లాప్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రు క‌లిసి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇదే శ్రీ‌ను వైట్ల ఆఖ‌రి ప్ర‌య‌త్నం అని ఇది పోతే ఇక ఆ డైరెక్ట‌ర్ గా శ్రీ‌ను వైట్ల కెరీర్ ముగిసిన‌ట్టేనా?  అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. శ్రీ‌ను వైట్ల కూడా ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ కావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News