ఒక సినిమాకు భారీగా బిజినెస్ జరగాలంటే స్టార్ హీరోలైనా ఉండాలి.. లేకపోతే స్టార్ డైరెక్టర్లయినా ఉండాలి. ఇద్దరి కాంబినేషన్ అయినా ఉండాలి. ఇవి లేకుండా ఒక సినిమాకు భారీ బిజినెస్ జరగడం దాదాపుగా అసాధ్యం. అయితే ఇలాంటి ప్రాజెక్టులు టాలీవుడ్ లో సెట్ కావడం చాలా అరుదుగా జరుగుతోంది. కారణం ఒక్కో దర్శకుడు ఒక్కో సినిమాకు ఏడాది నుంచి రెండేళ్ళు వరకూ సమయం తీసుకుంటూ ఉండడమే.
ఇతర భాషలలో స్టార్ డైరెక్టర్లు ఒకరిద్దరు తప్ప మిగతా వారు ఇంత సమయం తీసుకోకుండా సినిమాలను త్వరగా పూర్తి చేస్తున్నారు. కానీ టాలీవుడ్ దగ్గరకు వస్తే ప్రతి టాప్ డైరెక్టర్ ఒక సినిమా చేసేందుకు కనీసం ఏడాది తీసుకుంటున్నారు. ఒక్కో సందర్భంలో అది రెండేళ్ళు.. మూడేళ్ళు అవుతోంది. రాజమౌళి ఒక్కో సినిమాకు రెండేళ్ళు తీసుకుంటున్నారు. ఒక్కోసారి అది మూడేళ్ళు కూడా అవుతోంది. మరో స్టార్ డైరెక్టర్.. వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కొరటాల శివ ప్రతి సినిమాకు ఏడాది తీసుకుంటారు. ఈసారి అది రెండేళ్ళపైనే అవుతోంది. ఇక సుకుమార్ విషయమే తీసుకున్నా అదే వ్యవహారం. ప్రతి సినిమాకు సుకుమార్ ఎడాదిన్నర సమయం తీసుకుంటారు. ఈసారి అది మరింతగా పెరిగింది.. రెండేళ్ళ సమయం తీసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఏళ్ళ తరబడి సమయం తీసుకుంటున్న దర్శకుల లిస్టు చాలా పెద్దదే ఉంది.
దీనికి చాలా కారణాలే ఉన్నాయి. భారీ స్పాన్ ఉన్న కథలు ఎంచుకోవడంతో ఇలా జరుగుతోంది. స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలనుకోవడం.. సంవత్సరాల తరబడి వారి డేట్స్ కోసం ఎదురు చూడడం వల్ల కూడా ఇలా ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి. నిజానికి భారీ బిజినెస్ చేయగల సత్తా ఉండే దర్శకులు అందరూ ఇలా చేయడంతో ఒక ఏడాదిలో రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది.
ఏదో ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం ఇంత సమయం తీసుకోవడం కరెక్టేమో కానీ ప్రతి సినిమాకు ఇలా సంవత్సరాల తరబడి సమయం తీసుకోవడం సరికాదన్న సంగతి దర్శకులు కూడా అలోచిస్తే బాగుంటుంది. అన్నీ భారీ ప్రాజెక్టులు కాకుండా గ్యాప్ ఉన్న సమయంలో మీడియమ్ రేంజ్ హీరోలతో మీడియం బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని.. సెకండ్ లీగ్ లో ఉన్న హీరోలకు స్టార్ డైరెక్టర్లతో పని చేసే అవకాశం లభిస్తుందని ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.