బద్రీనాథ్ - బాహుబలి సినిమాల్లో నటుడిగా మెప్పించిన రాకేష్ వర్రె నిర్మాతగా మారి తానే హీరోగా నిర్మించిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. ఈ సినిమా విడుదలకు ముందే చూసిన దిల్ రాజు సినిమా నచ్చి దీనిని తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ నుండి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సినిమాలో ఏదో విషయం ఉంటేనే కానీ దిల్ రాజు తన బ్యానర్ మీద సినిమా విడుదల చేయడానికి ఒప్పుకోడని అందరికీ తెలిసిందే. పైగా ఈ సినిమా కోసం సుకుమార్ - కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు కూడా వీడియో బైట్స్ ఇచ్చి సినిమాను ప్రమోట్ చేశారు. అయినా 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమా పై ఎవరికీ అంత అంచనాలు లేవు. ఈ సినిమాకి థియేటర్స్ కూడా చాలా తక్కువగా దొరికాయి.
అయితే ఈ సినిమా హీరో నిర్మాత - హీరో అయిన రాకేష్ వెర్షన్ వేరేగా ఉంది. 'సైరా' మూవీ మార్కెట్ లో ఉండగా తన మూవీ విడుదల చేస్తే తట్టుకోగలమా అని భయపడ్డానని కానీ దసరా సెలవులు ఉండడంతో తమ సినిమా బాగా ఆడుతుందని చెప్పాడు. ఇటీవలే తాను ఒక థియేటర్ కి వెళ్లానని ఆ థియేటర్ కెపాసిటీ 1000 అని అందులో 800 వరకు ఆక్యుపెన్సీ కనిపించిందని అంటున్నాడు. తక్కువ థియేటర్లలో రిలీజ్ చేసినా మంచి కలెక్షన్స్ రాబడుతుందని, దసరా టైములో కొన్నిచోట్ల థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయని చెప్పాడు. ఈ సినిమా కథాంశం కులాల గురించి ఉండడంతో కథ నచ్చినా ఎవరూ నిర్మాతగా ఉండడానికి ముందుకు రాలేదని అందుకే తానే నిర్మాతగా మారి ఈ సినిమా తీశానని చెప్పాడు రాకేష్.