డైరెక్టర్ పై గుస్సా అయిన స్టార్ హీరో!

Update: 2018-11-15 11:58 GMT
అదో భారీ బడ్జెట్ చిత్రం.  బాహుబలి పంథాలో తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో ఈమధ్య దర్శకుడి వ్యవహారంపై కస్సుబుస్సులాడుతున్నాడట. సొంత ప్రొడక్షన్ లో రూపొందే సినిమాకు స్టార్ హీరో తనయుడే నిర్మాత.  కానీ అయన వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ స్టార్ హీరోనే నిర్మాత సీట్లో కూర్చోవాల్సి వస్తోందట.

తనయుడు సెట్లో ఉన్నప్పుడు మాత్రం స్టార్ హీరో కూల్ గా తనపని తాను చేసుకుపోతున్నాడట.  తన యాక్టింగ్ విషయం తప్ప మిగతా విషయాల్లో ఏమాత్రం తలదూర్చకుండా హ్యాపీ గా సాగుతోందట. కానీ కుమారుడు షూటింగ్ లోకేషన్లో లేకపోతే మాత్రం నిర్మాతగా కూడా రెండు భాద్యతలు నిర్వహించాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నాడట. డైరెక్టర్ అవసరానికి మించి అనవసరమైన ఖర్చు పెట్టిస్తున్నాడని ఇప్పటికే పలుమార్లు అప్సెట్ అయ్యాడట.  డైరెక్టర్ ను ఒకటి రెండు సార్లు గట్టిగా క్లాస్ పీకడంతో ఆ డైరెక్టర్ కూడా నొచ్చుకున్నాడట.

మరి ఈ విషయంలో హీరోగారి కుమారుడు ఏం చేస్తాడా.. నాన్నగారికి ఎలా సర్దిచెప్పి మిగతా సినిమా షూటింగ్ ను ఎలా ముందుకు తీసుకెళతాడా అని అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా రెండు పడవలపై కాలు పెట్టడం అంత సులువుకాదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఏదో కొందరు ఘనాపాఠీలకు తప్ప అందరికీ సాధ్యమయ్యే వ్యవహారం కాదు. 
Tags:    

Similar News