బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ జోరు ఏంటన్నది స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఖాన్ త్రయానికి ధీటుగా బాక్సాఫీస్ ను షేక్ ఆడించే హీరో అక్షయ్. అయితే.. సినిమాల వేగంలోనూ అతనికి అతనే సాటి. తనతోపాటు అగ్రనటులుగా ఉన్నవారు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే అవస్థలు పడుతుంటే.. ఈ హీరో మాత్రం ఏకంగా మూడ్నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నాడు. ఇందులోనూ సక్సెస్ పర్సెంట్ కూడా ఎక్కువే ఉంటుండడంతో బాక్సాఫీస్ మాగ్నెట్ గా మారిపోయాడు అక్షయ్ కుమార్.
మూవీస్ సెలక్షన్స్ లోనూ అక్షయ్ కుమార్ రూటే సెపరేటు. తన మార్కు కామెడీ చిత్రాలను చేస్తూనే.. సందేశాత్మక చిత్రాలు కూడా లైన్లో పెడుతుంటాడు. యాక్షన్ ఎనీ టైమ్ అంటూ దుమ్ములేపుతున్నాడు. ఇక, కలెక్షన్ల గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. అక్షయ్ నుంచి ఎలాంటి సినిమా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ. కనీసం వంద కోట్లు ఎటూపోవు అన్నది నిర్మాతల నమ్మకం. అందుకే.. ఆయనతో సినిమాలు చేయడానికి సూట్ కేసులు పట్టుకొని వెంట తిరుగుతుంటారు.
అయితే.. రెండు దశల్లో కరోనా కొట్టిన దెబ్బతో రావాల్సిన సినిమాలన్నీ ఆగిపోయాయి. కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. దీంతో.. అక్షయ్ ఆదాయం భారీగా పడిపోయింది. అందువ్లల రాబోయే రోజుల్లో రెట్టింపు వేగంతో పనిచేసి లోటను పూడ్చుకోవాలని చూస్తున్నాడట. ప్రస్తుతం అక్షయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఐదు ఉన్నాయి.
కొన్ని సెట్స్ మీద ఉండగా.. కొన్ని ప్రారంభం దశలోనే ఉన్నాయి. వీటిని 2021, 2022లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ.. కరోనాతో ప్లానింగ్ మొత్తం తలకిందులైంది. ఇప్పుడు లేటెస్ట్ ప్లాన్ ప్రకారం.. ఇవన్నీ వచ్చే ఏడాదిలోగా ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయ్యాడట. అందులో.. బెల్ బాటమ్, పృథ్వీరాజ్, అట్రాంగి రే, బచ్చన్ పాండే, ఇంకా ‘రామ్ సేతు’ సినిమాలున్నాయి. ఈ ఐదు చిత్రాలను 2022లోనే పూర్తిచేయాలని బలంగా నిర్ణయించుకున్నాడట. ప్రతీ సినిమా సగటున 200 కోట్లు రాబట్టినా.. మొత్తం ఐదు సినిమాలకు కలిపి వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ గీశాడట. మరి, ఎంత వరకు వర్కవుట్ అవుతుందన్నది చూడాలి.