స్టార్ హీరో కారు ట్యాక్స్ వివాదం మరోసారి తెరపైకి..

Update: 2021-09-17 10:30 GMT
తమిళ స్టార్ హీరో విజయ్ కొన్న కారు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తలపతి విజయ్ అప్పట్లో రోల్స్ రాయిస్ కారు కొన్నాడు. ఆ కారుకు ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్ ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నాడు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతడు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు.అన్ని పన్నులు, చార్జీలను చెల్లించాడు.

కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుంచి మాత్రం మినహాయింపును కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపునకు సంబంధించి కేసు తొమ్మిదేళ్లుగా పెండింగ్ లో ఉంది.

స్టార్ హీరో అయ్యిండి.. సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరో విజయ్ ప్రవేశ పన్ను మినహాయింపు కోరినందుకు హైకోర్టు జడ్జి ఫైర్ అయ్యాడు. ట్యాక్స్ కట్టాల్సిందేనని తీర్పునిచ్చి షాక్ ఇచ్చాడు.

న్యాయమూర్తి తీవ్రమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయ్ మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. అక్కడ కూడా విజయ్ కు చుక్కెదురైంది.

తాజాగా బెంచ్ కోర్టు తదుపరి ఆదేశాలపై విజయ్ మొత్తం పన్ను మొత్తాన్ని చెల్లించాడు. ఈ మేరకు నిన్న తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు విజయ్ పన్ను కట్టినట్లు వెల్లడించింది. దీంతో ఈ కేసును కోర్టు మరోసారి వాయిదా వేసినట్టు సమాచారం.




Tags:    

Similar News