శుభాకాంక్ష‌లేనా... స‌మాన‌త్వం లేదా?

Update: 2018-03-08 15:30 GMT
మ‌హిళ దినోత్స‌వం రోజున‌... మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతాయి. ఇక హీరోయిన్ల‌కైతే మ‌రి చెప్ప‌క్క‌ర్లేదు. హీరోలతో పాటూ ద‌ర్శ‌కులు... నిర్మాత‌లు... అభిమానులు మేసేజ్‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు. హీరోలు త‌మ సినిమా పోస్ట‌ర్ల‌పైనా... సోష‌ల్ మాధ్య‌మాల‌లోనూ కూడా శుభాకాంక్ష‌లు చెబుతూ ప్ర‌చారం బాగానే చేసుకుంటారు. మ‌హిళ‌ను అంత‌గా గౌర‌వించే హీరోలు... త‌మ సినిమాలలో... పోస్ట‌ర్ల‌లో మాత్రం ఫిమేల్ లీడ్‌ను తొక్కేస్తారు ఎందుకో.

ఏ సినిమా ఫస్ట్ లుక్ అయినా తీసుకోండి. మొద‌ట హీరో పాత్రే ప‌రిచ‌యం అవుతుంది. హీరోయిన్ ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం కూడా లేన‌ట్టే ప్ర‌వ‌ర్తిస్తారు ద‌ర్శ‌క నిర్మాత‌లు... హీరోలు. ఫ‌స్ట్ పోస్ట‌ర్ లో ఆమె జాడే ఉండ‌దు. ఆ త‌రువాత వ‌చ్చే పోస్ట‌ర్ల‌లో హీరోయిన్ ఎక్క‌డో ఒక మూల క‌నిపిస్తుంది. మ‌హిళా దినోత్స‌వం రోజున కూడా క‌నీసం హీరోయిన్‌ను హైలైట్ చేసినా పోస్ట‌ర్ లేదా టీజ‌ర్లు విడుద‌ల చేయ‌రు. ఈ రోజు ధ‌నుష్ త‌న సినిమా వ‌డా చెన్నై పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అందులో హీరోయిన్ లేనే లేదు. త‌మ పాత్ర గెట‌ప్‌నే ప‌రిచ‌యం చేశాడు.

అల్లు అర్జున్ మ‌హిళ‌ల‌కు ఈ రోజు శుభాకాంక్ష‌లు చెప్పాడు. అత‌ను చేస్తున్న నా పేరు సూర్య‌... సినిమా తాలూకు ఎన్ని పోస్ట‌ర్ల‌లో... టీజ‌ర్ల‌లో... ట్రైల‌ర్ల‌లో అను ఇమ్మాన్యుయేల్ క‌నిపించింది? స‌మాన‌త్వం అంటే నోటితో చెప్పేంత వ‌ర‌కేనా ఆచ‌ర‌ణలో మాత్రం పెట్టరా?  లేడీ ఓరియంటెడ్ సినిమా అయితేనే హీరోయిన్ కు త‌గిన ప్ర‌చారం ల‌భించింది. పెద్ద హీరోల ప‌క్క‌న చేసే ఏ హీరోయిన్‌కు స‌రైన స్థానం ద‌క్క‌దు. ఇదేనా స‌మాన‌త్వం అంటే?
Tags:    

Similar News