ఏరు ఎగదోసుకొస్తే ఒడ్డును కోసేస్తుంది. నది పొంగి పొర్లితే ఊళ్లను కోసేస్తుంది. మరి కరోనా విరుచుకుపడితే.. ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ప్రస్తుత సన్నివేశమిదే. 202 దేశాలు కొవిడ్ 19 వైరస్ దెబ్బకు ఒణికిపోతున్నాయి. అగ్ర రాజ్యాలు బెదిరిపోతున్నాయి. ఇండియా ఆపసోపాలు పడుతోంది. వైరస్ మహమ్మారీని ఆపేదెలా? వ్యాక్సిన్ అన్నదే లేని ఈ భూతాన్ని వదిలించుకునేదెలా? అన్నది తేలక అతలాకుతలం అవుతున్నారంతా. మార్కెట్లు ఫాల్ డౌన్.. జనజీవనం లాక్ డౌన్. ఆర్థిక వ్యవస్థలు ధడేల్ ధడేల్.
మరి ఇలాంటి టైమ్ లో పరిస్థితిని అంచనా వేసి టాలీవుడ్ లో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ టైమ్ లో మొదలైన షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సినవి అడ్రెస్ లేకుండా పోయాయి. దీంతో నిర్మాతలపైనా ఇతర ఇండస్ట్రీపైనా ఆ మేరకు భారం పడిపోయింది. ఫైనాన్సులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాతల సన్నివేశం అయితే ఇక అధోగతే. మరి ఇలాంటి పెను విపత్తు సమయంలో ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్ని కోసేస్తున్నాయి. కొందరు సగం కోసేసి మిగతాది ఇస్తుంటే.. కొందరు సగం ఓసారి సగం ఇంకోసారి అంటూ మెలిక వేస్తున్నారు.
ఈ సన్నివేశంలో కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకునే హీరోల పారితోషికాల పై ఆ ప్రభావం పడనుందా? అంటే అవుననే భావిస్తున్నారంతా. అయితే నిర్మాతలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇలాంటి కోతకు మన స్టార్ హీరోలు అంగీకరిస్తారా? అల్పాదాయ వర్గాలు.. పేద మధ్యతరగతి కాదు కాబట్టి కష్టకాలంలో నిర్మాతల్ని ఆదుకునే వీలుంటుందా? లేదూ ఈఎంఐలు.. ఇంటి అద్దె.. పాల బిల్లు అంటూ కంగారు పడే.. మామూలు ఉద్యోగుల్లా తాము కూడా కలతకు గురవుతారా? అన్నది చూడాల్సి ఉంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంత వెయిట్ చేస్తే వైరస్ లా ఔట్ బరస్ట్ అయ్యే నిర్మాతలెందరో హీరోలెందరో తేల్తుందిలే!