స్టార్ హీరోయిన్ రహస్య వివాహం??

Update: 2017-03-31 16:42 GMT
ఆమె ఓ స్టార్ హీరోయిన్. వారసురాలిగా సినిమా రంగంలోకి వచ్చినా రాత్రికి రాత్రే స్టార్ డం రాలేదు. సినిమాల కోసం బాగానే కష్టపడింది. సినిమా రంగానికే చెందిన ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం సంపాదించేసింది. కెరీర్ డల్ గా సాగిన  కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా ఓ శక్తివంతుడైన స్టార్ హీరో ఇచ్చిన బ్లాక్ బస్టర్ తో స్టార్ హీరోయిన్ గా మారింది.

అక్కడి నుంచి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తో పాటు హిట్స్ కూడా సంపాదించి.. పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడీ బ్యూటీ పెళ్లి చేసేసుకుందనే న్యూస్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా లండన్ కు చెందిన ఓ వ్యక్తితో ఈమె ప్రేమాయణం సాగుతూనే ఉంది. నెలల నుంచి జరుగుతున్న వ్యవహారం కావడంతో.. ఏదో ఉందని అనుకున్నారు కానీ.. ఏకంగా పెళ్లి కూడా చేసేసుకుందట. గతంలో మాదిరిగా ముంబై.. చెన్నైల్లో కాకుండా.. తన ఖాళీ సమయం అంతా యూకేలోనే గడిపేస్తోంది. లండన్ లో ఉండడానికి మ్యూజిక్ మీద ఉన్న ప్రేమ.. అక్కడ ప్రోగ్రామ్స్ అని చెబుతోంది.

అయితే.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తరచూ లండన్ వెళుతుండడం ఈ రూమర్స్ కు ఆజ్యం పోస్తోంది. ఓ భారీ చిత్రంలో ఈమె లుక్స్ పై విమర్శలు రావడానికి కారణం కూడా.. పెళ్లయిపోయిన హీరోయిన్ కావడమే అన్నది టాక్. అఫ్ కోర్స్.. కన్ఫాం అయ్యేవరకూ ఇవన్నీ రూమర్స్ మాత్రమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News