బాలీవుడ్ లో ఫ్యాషనేటెడ్ లేడీ నిర్మాతలెంతో మంది. ఈ జాబితాలో కొంత మంది స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలగా రాణిస్తున్నారు. ఇటీవలి కాలంలో నవ నాయికలు సైతం కాన్సెప్ట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. కంగనా రనౌత్.. అనుష్క శర్మ..అలియాభట్...దీపికా పదుకొణే లాంటి భామలు నిర్మాతలగానూ అభిరుచిని చాటుకుంటున్నారు.
ఓవైపు హీరోయిన్లగా నటిస్తూనే ప్రొడక్షన్ పనుల్ని సైతం నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ వరుసలో బెబో కరీనా కపూర్ కూడా చేరింది. ఈ భామ సైతం నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. తొలి ప్రయత్నంగా మరో లేడీ నిర్మాతతో చేతులు కలిపి ఓ సినిమాని నిర్మిస్తుంది. దర్శకుడు హన్సల్ మోహతా తెరకెక్కిస్తోన్న చిత్రన్ని ఏక్తాకపూర్ తో కలిసి నిర్మాణంలోకి దిగింది.
ఈ విషయాన్ని కరీనా స్వయంగా రివీల్ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని బెబో గతేడాదే తెరకెక్కించాల్సి ఉందిట. కానీ అనివార్య కారణాల వల్ల ఇంత కాలం డిలే అయింది. ఇప్పటికే స్ర్కిప్ట్ సహా అన్ని రకాల పనులు పూర్తిచేసారు.
ఏక్తా తో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో నటించడం కంటే బురువైన బాధ్యతలు మోయాల్సి వస్తుంది.
నటిగా ఎంపికైతే ఆ పాత్ర షూటింగ్ పూర్తిచేస్తే అక్కడితో మన బాద్యత పూర్తవుతుంది. కానీ నిర్మాణం అంటే మొదలు దగ్గర నుంచి ముగింపు వరకూ ప్రతీ పనిని దగ్గరుండి చూసుకోవాలి. అటుపై ప్రచారం పనులకు ఎంతో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం అంటే చిన్న విషయం కాదు. ముందు నేను ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలను` అని కరీనా తెలిపింది.
ఇక కరీనా నటించిన లాల్ సింగ్ చడ్డా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తీవ్ర నిరాశని మిగిల్చింది. ఆ పరాజయం నుంచి కరీనా తొందరగానే బయట పడింది. కొత్త ప్రాజెక్ట్ వీలైనంత వేగంగా పూర్తిచేసే ఉత్సాహం తనలో కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే నిర్మాతగా తన కొత్త చిత్రం గురించి రవీల్ చేసింది. తమరి ఇదే ఉత్సాహాన్ని కడ వరకూ కొనసాగిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం నటిగా కరీనా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.