ప్రేమపై ఒక కవిత రాసిన స్టార్ హీరోయిన్

Update: 2019-05-15 06:25 GMT
కవితలకు ఈమధ్యకాలంలో కాస్త డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే.  కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కవిగా  మారి తమకు తెలిసి తెలియని కపిత్వంతో జనాలను మానసికంగా వేధించడానికి ప్రయత్నించడమే.  ఇక కొందరైతే సామజిక ప్రయోజనం ఉండాలనే  ఉద్దేశంతో కవిత్వంలోకి ఏడుపులను పెడబొబ్బలను చొప్పించడంతో జనాలు కవిత్వం అంటే చాలు పారిపోతున్నారు.  ఎవరైనా కవిత చెప్తాను అని అంటే.. వెంటబడి కొట్టేలా ఉన్నారు.  

అయితే 'వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లీష్ లో ఇన్స్పిరేషన్ ఇచ్చి జనాలను మనస్సులో ఆలోచన రేకెత్తించినా.. 'అమృతం కురిసిన రాత్రి' అంటూ తిలక్ భావుకతతో ఆకట్టుకున్నా.. ['కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు..' అంటూ పదునైన కత్తుల్లాంటి మాటలతో శ్రీశ్రీ  కొందరు జనాలకు పట్టిన తుప్పును వదలగొట్టేందుకు ప్రయత్నించినా కవిత్వంలో ఒక బ్యూటీ ఉంటుంది. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టు.. కపిత్వం వేరే.. కవిత్వం వేరే.  

మరి ఇదంతా మన మిల్కీ బ్యూటీ తమన్నాకు తెలుసో లేదు కానీ హిందీలో ఒక కవితను రాసి తన ఇన్స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి కాస్తం కష్టంగా అనిపించే ఇంగ్లీష్ పదాలతో క్యాప్షన్ ఇచ్చింది.  ఆమె క్యాప్షన్ ను రెండు ముక్కల్లో చెప్పుకుంటే "నాకు కవిత్వం అంటే ఇష్టం. తరచుగా నేను నా మనసులోని ఆలోచనలకు అక్షర రూపం ఇస్తాను" అని చెప్పింది.  ఇక "నిజమైన ప్రేమ నిన్ను నువ్వు ప్రేమించుకోవడంతో ప్రారంభం అవుతుంది" అంటూ మరో విషయం కూడా చెప్పింది. 'సెల్ఫ్ లవ్' మీద సాగే ఈ హిందీ కవిత ను ఇమేజ్ ఫార్మాట్ లో పోస్ట్ చేసింది.  దాన్ని అనువాదం చేస్తే హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల డైలాగ్స్ లాగా కామెడీగా మారుతుందనే ఉద్దేశంతో అనువాదం చేయడం లేదు. హిందీ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదివి చక్కగా అర్థం చేసుకోండి. కవిత ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకునేవాళ్ళు లైట్ తీసుకోండి!
Tags:    

Similar News