RRR గ్లిమ్స్ పై చిరు - మహేష్ - బన్నీ కామెంట్స్..!

Update: 2021-11-01 11:27 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్టుగా ఓ గ్లిమ్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 45 సెకండ్స్ నిడివితో కట్ చేయబడిన ఈ వీడియో.. అద్భుతమైన విజువల్స్ - కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతోంది. వ్యూస్ పరంగా దూసుకుపోతూ, కేవలం 2 నిమిషాల్లో అత్యంత వేగంగా 100K లైక్స్ సాధించిన గ్లింప్స్ గా నిలిచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. RRR గ్లిమ్స్ కు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి.

''ఎలక్ట్రిఫైయింగ్!! ఇది చాలు!'' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ''అద్భుతమైన విజువల్స్ చూపించి అబ్బురపరిచారు! జస్ట్ వావ్.. స్టన్నింగ్!! #RRR సినిమా చూడటానికి వేచి ఉండలేను'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ''#RRR యొక్క మైండ్ బ్లోయింగ్ గ్లిమ్స్. ఎస్ఎస్ రాజమౌళి గారూ మీరు భారతీయ సినిమాకే గర్వకారణం. మా బ్రదర్ రామ్ చరణ్ - నా బావ ఎన్టీఆర్ పవర్ ప్యాక్ షో. అజయ్ దేవగన్ - అలియా భట్ మరియు మొత్తం నటీనటులు సిబ్బందికి అభినందనలు'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా రెడీ చేసిన ఫిక్షనల్ కథతో పీరియాడికల్ నేపథ్యంలో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్ గణ్ - సముద్ర ఖని - శ్రియా శరన్ - రాహుల్ రామకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెత్ తో నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న RRR 2022 సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కాబోతోంది.


Tags:    

Similar News