కోట్లు ఖర్చు చేసి కొన్న క్రేజీ ప్రాజెక్ట్స్.. అదే స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టేనా..?
టాలీవుడ్ లో ప్రస్తుతం డజనుకు పైగా క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఈ సినిమాల థియేట్రికల్ రైట్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ - డిజిటల్ - శాటిలైట్ హక్కులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రముఖ టెలివిజన్ ఛానల్ 'స్టార్ మా' వారు తొమ్మిది భారీ సినిమాల శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 'స్టార్ మా' మీ అందరినీ ఎంటర్టైన్ చేయబోతోంది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోని రిలీజ్ చేసింది.
'స్టార్ మా' ప్రకటించిన సినిమాలలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'.. సుకుమార్ - అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమా 'పుష్ప'.. రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్ వస్తున్న 'ఖిలాడి'.. నితిన్ - మేర్లపాక గాంధీ కలసి చేస్తున్న 'మ్యాస్ట్రో'.. అక్కినేని నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రూపొందున్న 'లవ్ స్టోరీ' సినిమాలు ఉన్నాయి.
అలానే అఖిల్ అక్కినేని - బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో రూపొందనున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నాని - శివ నిర్వాణ 'టక్ జగదీష్'.. మహేష్ బాబు - పరశురామ్ పెట్లా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట'.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాలను సొంతం చేసుకున్నట్లు స్టార్ మా వెల్లడించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ శాటిలైట్ రైట్స్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరి కోట్లకు కోట్లు పెట్టి కొన్న ఈ సినిమాలు అదే స్థాయిలో క్రేజ్ తెచ్చిపెడతాయో లేదో చూడాలి.
ఇకపోతే 'కేజీఎఫ్ 1' సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ మా వారు.. 'కేజీఎఫ్ చాప్టర్ 2' శాటిలైట్ హక్కులు దక్కించుకోలేకపోయారని టాక్. వీటిని 'జీ' గ్రూప్ సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'రాధే శ్యామ్' 'సలార్' 'ఆదిపురుష్'.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' 'ఏకే' రీమేక్.. 'ఎఫ్ 3' 'లైగర్' 'మేజర్' 'నారప్ప' 'విరాటపర్వం' 'ఆచార్య' వంటి సినిమాల రైట్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.