తొమ్మ‌ది భాష‌ల్ని అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల ఒకే ఒక్క స్టార్!

Update: 2022-11-16 00:30 GMT
మూడు కాదు.. నాలుగు కాదు.. ఐదు కాదు.. ఆరుకాదు.. ఏకంగా తొమ్మిది భాషలు గుక్కి త‌ప్పికుండా అన‌ర్ఘ‌ళంగా మాట్లాడ‌గ‌ల స్టార్ అత‌ను. సౌత్ లో అన్ని భాష‌ల్ని చుట్టేస్తాడు. తెలుగు.. త‌మిళం.. క‌న్న‌డం.. మ‌ల‌యాళం అన్నింటిని ఒకేసారి మాట్లాడ‌గ‌ల‌డు. ఇంగ్లీష్.. హిందీ.. స్పానీష్.. జ‌ప‌నీస్.. చైనీస్ భాష‌ల్ని సైతం బంతాడేస్తాడు.

ఇంత‌కీ ఎవ‌రా హీరో?  అన్ని భాష‌ల్ని ఒకేసరి మాట్లాడేసే ఆ మేథావి ఎవ‌రంటే? అత‌ను ఎవ‌రో కాదు..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.  అవును ఈ భాల‌న్నింటిని  మాట్లాగ‌ల మేథావి తార‌క్ అంటూ ఎంతో గ‌ర్వంగా చెబుతున్నారు. ట్రైనింగ్ ఇవ్వాలే గానీ ఆరు నెల‌ల్లో ప్ర‌పంచ‌లో ఏ భాషైనా ఇట్టే  మాట్లాడేస్తాడ‌ని కాన్పిడెంట్ గా చెబుతున్నారు.

నేర్చుకోవాల‌న్న క‌సి ప‌ట్టుద‌ల‌..ఏకాగ్ర‌త అన్ని ఇంకెవ్వ‌రిలోనూ చూడ‌లేద‌ని టైగ‌ర్  అత్యంత స‌న్నిహితుడొక‌రు చెప్పారు. ఇదే నిజ‌మైతే ఇన్ని భాష‌లు  మాట్లాడ‌గ‌ల ఏకైక తెలుగు హీరోగా  తార‌క్ ని చెప్పుకోవ‌చ్చు. తెలుగులోనే కాదు..దేశంలోనే ఇన్ని భాష‌లు మాట్లాడే హీరో లేడ‌ని చెప్పొచ్చేమో. ఎందుకంటే హిందీ న‌టులు  ఎవ‌రికి ద‌క్షిణాది భాష‌లేవి రావు.

క‌నీసం అర్ధం చేసుకోలేరు కూడా. ఇంగ్లీష్..హిందీ....ఇంకా మాట్లాడ‌గ‌ల్గితే ప్ర‌పంచంలో వేర్వేరు భాష‌లు మాట్లాడ‌వ‌చ్చు. సౌత్ లాంగ్వేజెస్ ని మాత్రం క‌నీసం ట‌చ్ కూడా చేయ‌లేరు. ఇక మిగ‌తా  తెలుగు హీరో లెవ‌రైనా? మ‌హా అయితే  సౌత్ భాష‌లు మాట్లాడ‌గ‌ల‌రు. ఇత‌ర దేశాల భాష‌లు మాట్లాడిన సంద‌ర్భాలు ఎక్క‌డా లేవు.

ఇంకా తెలుగు మిన‌హా  సౌత్ లో ఏ హీరో కూడా తెలుగు భాష‌ని స‌రిగ్గా మాట్లాడ‌లేరు.  అయితే క‌మ‌ల్  హాస‌న్ మాత్రం  వివిధ భాష‌ల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయ‌న విదేశీ  భాష‌లు ఎక్కువ‌గా మాట్లాడ‌గ‌ల‌రు.  తెలుగు ఎంతో చ‌క్క‌గా అర్ధం చేసుకుంటారు. మాట్లాడ‌గ‌ల‌రు కూడా.  మొత్తానికి యంగ్ టైగ‌ర్ 9 భాష‌లు మాట్లాడ‌టం అన్న‌ది చాలా రేర్ క్వాలిటీ గా చె ప్పొచ్చు.

అత‌ని లో మాట్లాడే స్పార్క్ ఎంతో బాగుంటుంది. చుట్టు ఉన్న వారిని ఇట్టే ఆక‌ట్టుకోగ‌ల‌డు.. ఆక‌ర్షించ‌గ‌ల‌డు.  అంత‌టి ఘ‌నాపాటి కాబ‌ట్టే  టీడీపీ ప్ర‌చారం లో సైతం పొల్గొన్ని త‌న వాక్చుత‌ర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. అత‌నిలో ఈ క్వాలిటీ చూసి మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడే షాక్ అయ్యారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News