సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అనేది శాశ్వతం కాదు. అందుకే స్టార్స్ అందరూ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా సపోర్ట్ గా మరికొన్ని ఇతర వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. హీరోలే కాదు చాలామంది హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన మొత్తాన్ని ఇతర రంగాలలో పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే అలాంటి స్టార్స్ కు కరోనా వైరస్ రూపంలో పెద్ద దెబ్బ పడింది.
కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలతో పాటుగా చిత్ర పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. సినీ ఇండస్ట్రీ మొత్తం స్తంభించి పోవడంతో ఆదాయం తగ్గిపోయింది. ఇక సంపాదించిందంతా వ్యాపారాల్లో పెట్టిన చాలా మంది స్టార్స్.. కరోనా కారణంగా ఇటు సినిమాల్లోనూ అటు వ్యాపారాల్లో బాగా నష్టపోయారు. టాలీవుడ్ స్టార్స్ కన్వెన్షన్ బిజినెస్ - హోటల్ బిజినెస్ - పబ్ లు - జిమ్ లు - ఫ్యాషన్ ఏజెన్సీల మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అయితే లాక్ డౌన్ కారణంగా అవన్నీ మూతబడి వ్యాపారం లేకుండా పోయింది.
టాలీవుడ్ యువ హీరో ప్రారంభించిన హోటల్ బిజినెస్ సూపర్ సక్సెస్ అయినప్పటికీ.. గత రెండేళ్లలో బాగా లాస్ వచ్చిందని సమాచారం. అలానే ఓ స్టార్ హీరో భాగస్వామిగా ఉన్న పబ్ బిజినెస్.. మరో సీనియర్ హీరో కన్వెన్షన్ బిజినెస్ కూడా నష్టాల్లో నడుస్తున్నాయని తెలుస్తోంది. బిగ్ స్టార్స్ పరిస్థితి పర్వాలేదు కానీ.. వ్యాపారాల్లో ఉన్న చిన్న హీరోహీరోయిన్లు మాత్రం భారీగా నష్టపోయారు. అయితే ఇప్పుడు సాదారణ పరిస్థితులు వస్తుండటంతో మళ్లీ వారి వ్యాపారాలను బాగుపరుచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు చిన్న హీరోలు తమ వద్ద ఉన్న స్థిరాస్తులను అమ్మకానికి పెట్టాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిసింది.