నిన్న విడుదలైన రాజశేఖర్ కల్కి టీజర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం తర్వాత ఈ యాంగ్రీ హీరో సబ్జెక్టులో హై ఇంటెన్సిటి కనిపించిందని సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ వర్మకే దక్కుతుంది. అతను తెరకెక్కించిన తీరు సినిమాటోగ్రఫీ నుంచి రాబట్టుకున్న పనితనం అన్ని కొత్త లెవెల్ లో ఉన్నాయి. బీజీఎమ్ కూడా స్టన్నింగ్ అనిపించుకుంది.
ఇవన్నీ ఎలా ఉన్నా కథకు సంబంధించిన కీలకమైన క్లూస్ ఇవ్వకుండా కల్కి టీమ్ చాలా జాగ్రత్త పడింది. ఏదో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ అనే ఇంప్రెషన్ ఇచ్చింది కానీ అసలు మెయిన్ ప్లాట్ ఏంటి దేని గురించి కల్కి పోరాడతాడు అనే క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన ఓ కథ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.
1985 ప్రాంతంలో కృష్ణా జిల్లాలో బాగా డబ్బున్న మూడు సంపన్న కుటుంబాలను చంపేందుకు ప్రత్యర్థులు ఓ మంచి నీటి సరస్సుని విషంతో నింపేస్తారు. అదే సమయంలో గుంటూరు జిల్లాలో అంతు చిక్కని రీతిలో కొన్ని హత్యలు జరుగుతాయి. అవి ఆ ఊరివాళ్ళే చేసి ఉంటారు. ఈ రెండు సంఘటనలు మిక్స్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్కిని రాసుకున్నట్టుగా వాటి సారాంశం.
ఇది నిజమో కాదో చెప్పలేం కానీ టీజర్ లోని విజువల్స్ దాంతో మ్యాచ్ అవుతున్నాయి. వీటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే రాజశేఖర్ కనిపించనున్నాడు. మొత్తానికి రాజశేఖర్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన ప్రశాంత్ వర్మకు అ! కన్నా డిఫరెంట్ మూవీగా కల్కి నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి