సౌత్ లో ఫుల్ డిమాండ్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన బుట్టబొమ్మ.. క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు ప్లాప్ అవ్వడం అమ్మడిని నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు తదుపరి చిత్రంతో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలో నీలాంబరి అనే పాత్రలో పూజా కనిపించనుంది. ఆమె ఇందులో చెర్రీ కి జోడీయే కానీ.. పాత్ర నిడివి తక్కువే ఉంటుంది. అయినప్పటికీ ఈసారి కచ్చితంగా సక్సెస్ అందుకోవాలి కాబట్టి.. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది.
'ఆచార్య' సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో చిరంజీవి - రామ్ చరణ్ - కొరటాల శివ తో పాటుగా పూజా హెగ్డే కూడా పాల్గొంది. అయితే ఈ ప్రెస్ మీట్ లో పూజా ఒక రకమైన వింత అనుభవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
ప్రెస్ మీట్ ప్రారంభమైన తర్వాత పూజా హెగ్డేను మాట్లాడమని అడగ్గా.. నేను చెప్పాల్సిందంతా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. Q&A సెషన్ కు వెళ్దాం అన్నట్లుగా ఆమె సమాధానమిచ్చింది. అయితే తెలుగు మీడియా పూర్తిగా 'ఆచార్య' వెనకున్న ప్రధాన వ్యక్తులపై దృష్టి పెట్టి.. పూజా ని విస్మరించింది.
చిరు - చరణ్ - కొరటాల శివలపై ప్రశ్నలు సంధించిన తెలుగు మీడియా మిత్రులు.. పూజా హెగ్డే ని ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నిజానికి స్టార్ హీరోయిన్ ప్రెస్ మీట్ లలో కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇటీవల 'రాధేశ్యామ్' 'బీస్ట్' సినిమాలను దూకుడుగా ప్రమోట్ చేసింది.
అయితే 'ఆచార్య' సినిమా విషయంలో మాత్రం మీడియా పూర్తిగా చిరంజీవి - చెర్రీ లపైనే ఫోకస్ చేయడంతో పూజా కి అసాధారణ పరిస్థితి ఎదురైంది. మెగా తండ్రీకొడుకులు తొలిసారిగా కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా కావడంతో సహజంగా వీరిపైనే అందరి దృష్టి ఉంటుంది.
అందులోనూ ఈ సినిమాలో పూజా హెగ్డే ది ఫుల్ లెన్త్ రోల్ కాదు. 45 నిమిషాల నిడివి ఉన్న రామ్ చరణ్ కు ప్రేయసిగా కనిపించనుంది. వీరిద్దరికీ 'నీలాంబరి' అనే పాట కూడా ఉంది. 'ఆచార్య' అనేది చిరు - చెర్రీల కాంబోలో రాబోతున్న అరుదైన సినిమా కావడంతో.. వారిపైనే మీడియా ఫోకస్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.