మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా టీజర్ డిజిటల్ రికార్డులు తిరగరాస్తోంది. టీజర్ లో చూపించినట్లుగా ఆచార్య ధర్మస్థలి సెట్ హైలైట్ అవుతోంది. దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధర్మస్థలి.. సౌత్ ఇండియన్ సినీ చరిత్రలోనే ఇంతవరకు నిర్మించిన అతిపెద్ద సినిమా సెట్. తాజాగా ఆచార్య సినిమాటోగ్రాఫర్ తిరు.. ఈ సినిమా పై, ధర్మస్థలి సెట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక డైరెక్టర్ కొరటాల శివను కూడా కొనియాడాడు. ఈ సందర్బంగా తిరు మాట్లాడుతూ.. "ఒక సినిమాకోసం రచయితలు ఉన్న వాస్తవికత గురించి రాయడం లేదా రచనతో ఫాంటసీ ప్రపంచం క్రియేట్ చేయడం చాలా సులభం. కానీ స్థలం యొక్క నాగరికతను, దాని సంస్కృతిని ఊహించుకొని.. అక్కడ దాగి ఉన్న వాస్తవికతను మళ్లీ సృష్టించడం అనేది అసాధారణమైన విషయం" అన్నాడు.
ఇంకా ‘ధర్మస్థాలి’ గురించి మాట్లాడుతూ.. "ధర్మస్థాలి అనే పేరులోనే ధర్మం అనే పదం నిలుస్తుంది. ధర్మం అనేది నిస్వార్థమైన త్యాగం లేదా అనంతమైన ప్రేమల గురించి కాదు. ధర్మం అనేది సహనం, ఉనికి గురించి. ధర్మం అనేది ముగుస్తుందా? అంటే మానవజాతికి ప్రకృతికి మధ్య సహనం, ఉనికి ఉన్నప్పుడు ధర్మం మొదలవుతుంది. ధర్మస్థలి అనేది ఇలా మరెన్నో విషయాలను ప్రతిబింబించే ప్రదేశం.. అదే ఆచార్య సినిమా. ఓ వ్యక్తిగా లేదా ఓ సినిమాగా ఆచార్య అంటే అదే. ఇంతటి గొప్ప ప్రపంచం సృష్టించిన డైరెక్టర్ కొరటాల శివకు హాట్స్ ఆఫ్" అంటూ చెప్పుకొచ్చాడు తిరు. ఇక సినిమాటోగ్రాఫర్ తిరు మాటలు వింటుంటే.. ఆచార్య సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అర్ధం చేసుకోవచ్చు. మరి మే 13న థియేటర్లలో సందడి చేయనున్న ఆచార్య మూవీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రాంచరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.