రాజు గారికి అక్కడ సీన్‌ రివర్స్.. చుక్కలు కనిపిస్తున్నాయట

Update: 2023-01-09 04:26 GMT
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల విషయంలో దిల్ రాజు ఆధిపత్యం క్లీయర్ గా ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. సుదీర్ఘ కాలంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు కనుక దిల్‌ రాజు థియేటర్ల పై పట్టు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ థియేటర్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇది ఒక వ్యాపారం కనుక ఆయన ఆ పని చేయడాన్ని ఎవరు తప్పుపట్టలేరు.

కొందరు ఆయన తీరును విమర్శించినా కూడా బిజినెస్‌ ఇది అంటూ కొందరు దిల్‌ రాజుకు మద్దతుగా ఉండే వారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న థియేటర్లకు అనుగుణంగానే తమ సినిమాలను ప్లాన్‌ చేసుకోవాల్సి ఉందని స్టార్‌ హీరోలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌ రాజు తమ సినిమాలను పంపిణీ చేయాలని చాలా మంది కోరుకుంటూ ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల విషయం లో దిల్‌ రాజు ఆధిపత్యం చూపిస్తూ ఉంటే పక్కరాష్ట్రం తమిళనాట మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. థియేటర్ల విషయంలో దిల్ రాజుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చుక్కలు చూపిస్తున్నారు. దిల్‌ రాజు వారసుడు సినిమాను అక్కడ విడుదల చేసుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడట.

విజయ్ తమిళనాట నెం.1 హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా వారసుడు సినిమా కంటే అజిత్ నటించిన తునివు సినిమాకే ఎక్కువ థియేటర్లు లభించాయి. అందుకు కారనం తునివు సినిమాను మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ విడుదల చేస్తున్నాడు. ఆయన అధికారం తో అత్యధిక థియేటర్లను తన ఆధీనంలో ఉంచుకోగలిగాడట.

తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే దిల్ రాజు థియేటర్లను తన చేతుల్లో పెట్టుకున్నాడో అక్కడ ఉదయనిధి స్టాలిన్ థియేటర్ల పై అజమాయిషీ చేస్తున్నాడట. అందుకే తునివు కు ఎక్కువ థియేటర్లు మరియు షో లు దక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే దిల్‌ రాజు వారసుడు సినిమాకు అక్కడ కష్టాలు తప్పడం లేదు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వారసుడు మరియు వీర సింహారెడ్డి సినిమాలను కాదని తన వారసుడు సినిమాకు థియేటర్లను ఇవ్వడం వల్ల కాస్త ఇబ్బంది తప్పదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. కనుక ఈ సమయంలో దిల్‌ రాజు నుండి షాకింగ్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News