కొన్నిసార్లు హీరోహీరోయిన్లకంటే సపోర్టింగ్ కారెక్టర్ చేసిన వారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయిపోతారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజిలో ఉంటుంది అనుకోండి. ఈమధ్యనే బాహుబలి సినిమాకి జపాన్ లో స్క్రీమింగ్ స్క్రీనింగ్ షో వేశారు. ఇందులో ప్రేక్షకులు తనివి తీరా అరవచ్చు, గోల చేయచ్చు ఏదైతే వారు మాములు సినిమా హాళ్లలో చేయలేరో. దానికి ముఖ్య అతిథిగా కుమార వర్మ వెళ్ళాడు.
అదేనండీ, బాహుబలి సినిమాలో కుమార వర్మ పాత్ర పోషించిన సుబ్బారాజు. జపాన్ లో వాళ్ళకి సినిమాలో కనిపించిన ప్రబాస్ - రానా - అనుష్క - రమ్య కృష్ణ యాక్టర్లు గా కాకా సూపర్ హీరోలలా కనిపించారట. కాకపోతే సుబ్బరాజు మాత్రం కుమార వర్మ పాత్రలో మనిషిలా కనిపించడంతో ఏరి కోరి మరి జపాన్ కు పిలిపించుకున్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలా జపాన్ కి ఎగిరిపోయాడు మన సుబ్బరాజు. అక్కడ దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
కుమార వర్మ గెటప్ లో వెళ్లిన సుబ్బరాజు చుట్టూతా జనం గూమిగూడిపోయి, ఫోటోలు ఆటోగ్రాఫ్ లు తీసేసుకుంటున్నారు. పనిలోపనిగా అక్కడి టూరిస్ట్ ప్రాంతాలు కూడా పర్యటించేస్తున్నాడు. చూస్తుంటే జపాన్ లో మనోడి క్రేజ్ బీభత్సంగా పెరిగిపోయినట్టు లేదు. ఇటు టాలీవుడ్లో నే కాక అటు జపాన్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్స్ ను పొందగలిగాడు సుబ్బరాజు.