ఇంత‌కీ సుబ్బ‌రాజు పారితోషిక‌మెంత‌?

Update: 2018-08-19 16:12 GMT
గ‌త కొంత‌కాలంగా ఎన్నో సినిమాలు వ‌స్తున్నాయి... వెళుతున్నాయి... కానీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు మాత్రం ఎందుక‌నో క‌నిపించ‌డం లేదు. చాలా త‌క్కువ‌గా సినిమాలు చేస్తూ.. ప‌రిమితంగానే క‌నిపిస్తున్నాడెందుకో. అయితే గ‌త కొంత‌కాలంగా పూరి జ‌గ‌న్నాథ్ & వ‌ర్మ కాంపౌండ్ సినిమాలు ప‌రిమితం అయిపోవ‌డం కూడా సుబ్బ‌రాజుకు సంద‌డి త‌గ్గ‌డానికి కార‌ణం కావొచ్చు. ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో మేటి ప్ర‌తిభావంతుడిగా పేరు తెచ్చుకున్న అత‌డు త‌న స్టామినాకు త‌గ్గ పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని అభిమానుల‌కు అనిపించదు.

అయితే గీత గోవిందంలో అత‌డి న‌ట‌న‌కు చ‌క్క‌ని పేరొచ్చింది. ప్ర‌స్తుతం స‌క్సెస్‌ మీట్ లో వేదిక‌పై క‌నిపించిన సుబ్బరాజు ఈ విజ‌యానికి సంతోషం వ్య‌క్తం చేస్తూ ఓ విష‌యం గురించి వేదిక‌పైనే ప్ర‌స్థావించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. నా నిర్మాత‌ల్ని ఇంకా ఎక్కువ పారితోషికం అడ‌గాల‌నుకుంటున్నాను. న‌టించినందుకు - డ‌బ్బింగ్ చెప్పినందుకు అంటూ న‌వ్వేస్తూ బ‌న్ని వాసు వైపు చూశాడు. అసంద‌ర్భ‌మే అయినా అక్క‌డ పారితోషికం మాట అన్నాడు కాబ‌ట్టి ఇండ‌స్ట్రీలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల పారితోషికాలు ఏ రేంజులో ఉంటాయి? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ అక్క‌డ సాగింది. రోజుకు రూ.4-5ల‌క్ష‌లు అందుకునే ఆర్టిస్టులు ఉన్నారు మ‌న‌కు. వీళ్ల రేంజులోనే సుబ్బ‌రాజు ఉన్నాడు. క‌నీసం ప‌ది కాల్షీట్ల‌కు ప‌ని చేసినా మినిమం 30-40 ల‌క్ష‌లు సంపాదించుకునే ప్ర‌తిభావంతుడు సుబ్బ‌రాజు అన‌డంలో సందేహం లేదు. ద‌శాబ్ధంన్న‌ర కాలంగా సీనియ‌ర్ ఆర్టిస్టుగా అత‌డు స్థిర‌ప‌డ్డాడు కాబ‌ట్టి పారితోషికం పెంచ‌మ‌ని అడిగినా త‌ప్పేం లేదు.

ఇక `గీత‌గోవిందం` వేదిక‌పై మ‌రో ఆక‌ర్ష‌ణ ఏమంటే వేదిక‌పై చిత్ర‌యూనిట్‌కి వినాయ‌కుడి మ‌ట్టి విగ్ర‌హాలు పంచ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సెప్టెంబ‌ర్ 13న వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఇలా యూనిట్‌ లో అంద‌రికీ విగ్ర‌హాలు పంచుతూ స‌త్పాంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టడం ఆక‌ట్టుకుంది. ఇక‌పోతే సుబ్బ‌రాజుకు ఓ వినాయ‌కుని విగ్ర‌హాన్ని అందించారు. పారితోషికానికి ఇదే అద‌నం అని భావించ‌వ‌చ్చు.
Tags:    

Similar News