కామెంట్‌: మన సక్సెస్ రేషియో అదన్నమాట

Update: 2018-01-03 04:30 GMT
టాలీవుడ్ లో ఏటేటా కుప్పలు తెప్పలు కొద్దీ సినిమాలు వచ్చేస్తాయి. బాలీవుడ్ తర్వాత అత్యధికంగా సినిమాలు మన దగ్గరే రూపొందుతాయి. కొన్ని సార్లు హిందీ మూవీస్ కి మించి మన సినిమాల కౌంట్ ఉంటుంది. 2017లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. గతేడాది తెలుగులో 154 డైరెక్ట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలా చెప్పుకోవడం బాగానే ఉంటుంది కానీ.. ఇందులో సక్సెస్ రేషియో ఎంత అన్న దగ్గరే అసలు సమస్య ఏంటో తెలుస్తుంది. కాకలు తిరిగినా క్రియేటివిటీని వాడినా కూడా.. అందులో కంటెంట్ లేక కొన్ని ధియేటర్లు దొరక్క కొన్ని.. బ్యాడ్ టైమ్ లో రిలీజై కొన్ని ఫ్లాపవుతున్నాయి. ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం పదండి.

గతేడాది వచ్చిన సినిమాల్లో హిట్ రేంజ్ ను అందుకున్న సినిమాలు 15 మాత్రమే. అంటే 10 శాతం సక్సెస్ రేషియో అన్నమాట. సాధారణ సగటుతో పోల్చితే నిజానికి ఇది ఎక్కువే. ఖైదీ నంబర్ 150.. గౌతమిపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి..నేను లోకల్.. ఘాజీ.. గురు.. బాహుబలి2.. రారండోయ్ వేడుక చూద్దాం.. నిన్ను కోరి.. ఫిదా.. నేనే రాజు నేనే మంత్రి.. ఆనందో బ్రహ్మ.. అర్జున్ రెడ్డి.. మహానుభావుడు.. చిత్రాలు మాత్రమే హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ స్థాయిని అందుకున్నాయి. ఇక యావరేజ్.. ఎబౌ యావరేజ్ అనిపించుకున్న చిత్రాల విషయానికి వస్తే.. కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. దువ్వాడ జగన్నాధం.. రాజా ది గ్రేట్.. కేశవ.. అమీతుమీ.. జై లవకుశ.. రాజుగారి గది 2 ఉన్నాయి. కేవలం ఏడు సినిమాలు మాత్రమే యావరేజ్ లిస్ట్ లో ఉండడం గమనించాలి. తక్కిన సినిమాలన్నీ ఫ్లాపే. కొన్ని అయితే దారుణమైన డిజాష్టర్లు కూడాను.

అంటే ఓవరాల్ గా 10% సినిమాలు హిట్ అయితే.. యావరేజ్ సినిమాలుగా మరో 5% మూవీస్ మిగిలిపోతున్నాయి. కానీ ఫెయిల్యూర్స్ మాత్రం ఏకంగా 85 శాతం ఉన్నాయన్న మాట. ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీసినా.. చివరకు అందులో 85% సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దెబ్బలు తింటున్నాయంటే.. అసలు ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఇండస్ర్టీగా ఈ ఇండస్ర్టీని అనుకోవాలేమో. కాకపోతే ఆ 10% క్యాటగిరీలో ఒక్కసారైనా ఉండకపోతామో అంటూ చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఓవరాల్ గా 2017లో టాలీవు్డ్ సక్సెస్ రేషియో కథను చూస్తే.. వచ్చేదానికంటే పోయేదే ఎక్కువగా ఉంది.
Tags:    

Similar News