బాహుబలి సినిమా తెలుగుతో పాటు అనేక భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆయా ఇండస్ట్రీల దర్శక నిర్మాతల్లోనూ ఆలోచన రేకెత్తించింది. శేఖర్ కపూర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం ‘బాహుబలి’ని చూసి ఇన్ స్పైర్ అయిపోయారు. బాలీవుడ్ దర్శకులు రాజమౌళిని చూసి నేర్చుకోవాలన్నారు. ఇండియాలో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలన్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు సుందర్ ‘బాహుబలి’ని చూసి స్ఫూర్తి పొందాడు. బాహుబలి తరహాలోనే భారీ పీరియాడ్రికల్ డ్రామాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరోవైపు కన్నడంలోనూ ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రయత్నం చేస్తోంది ‘ఈగ’ ఫేమ్ సుదీప్ కావడం విశేషం.
సుదీప్ హీరోనే కాదు దర్శకుడు కూడా. సింగం.. విక్రమార్కుడు.. మిర్చి లాంటి సినిమాల్ని స్వీయ దర్శకత్వంలో రీమేక్ చేశాడు. కొన్ని డైరెక్ట్ సినిమాలు కూడా తీశాడు. ఇప్పుడు బాహుబలి తరహాలో భారీ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తెలుగు.. తమిళం.. కన్నడ భాషల్లో భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా తీయబోతున్నట్లు సుదీప్ చెప్పాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందట. ‘‘ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘బాహుబలి’లాంటి సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఆ సినిమా మొదలుపెడతా’’ అని సుదీప్ చెప్పాడు.