లాక్ డౌన్ నిబంధనలతో ఆన్ లొకేషన్ నానా యాతన అనుభవించాల్సి ఉంటుందని పలువురు నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రాక్టికాలిటీలో ఏదీ సాధ్యం కాదన్న వాదనా బలంగానే వినిపిస్తోంది. కొవిడ్ రూల్స్ పాటించేందుకు అవకాశం లేని ఇండస్ట్రీ సినీఇండస్ట్రీ అని డి.సురేష్ బాబు సహా పలువురు సనీపెద్దలు ఇప్పటికే వారి ఆందోళనను వ్యక్తం చేశారు.
కొవిడ్ 19 నిబంధనలు సినిమా బడ్జెట్ ను పెంచుతాయని.. ఈ విధానంలో షూటింగులు చేయడం అసాధ్యమని చాలా మంది నిర్మాతలు.. దర్శకులు చెబుతున్నారు. నిజాం ప్రాంతంలో సుప్రసిద్ధ డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత అయిన నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ .. వారికి సెట్ లో కనీసం 80-150 మంది సభ్యులు అవసరమని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం 45 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నియమం పాటించడం కష్ట సాధ్యమైనదనేది ఆయన వ్యూ ఆఫ్ పాయింట్.
రోజంతా ఆన్ లొకేషన్ వైద్యుడు అందుబాటులో ఉండడం.. అన్ని వేళలా వస్తు సామగ్రి.. శానిటైజర్లు.. మాస్కులు.. చేతి గ్లోవ్స్ వగైరా ఏర్పాటు చేయడం అన్నది కచ్ఛితంగా బడ్జెట్‌ను పెంచుతాయని ఆయన తెలిపారు. చిత్రనిర్మాతలకు సులభతరం చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలలో కొన్ని మార్పులు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయనొక్కరే కాదు.. చాలా మంది పరిశ్రమ పెద్దల అభిప్రాయం ఇదే. ప్రభుత్వం నిబంధనలను సులభతరం చేసే వరకూ షూటింగుల్ని ఆపేస్తారా అన్నది చూడాలి. నిర్మాతల అభ్యర్థనను ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అన్నది ఇప్పటికి సస్పెన్స్.