మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తూ ఎంత సంపాదిస్తుంటాడో... బిజినెస్ ఎండార్స్ మెంట్లతో అంతకంటే ఎక్కువగానే సంపాదిస్తుంటాడు. దాదాపుగా ప్రతీ పాపులర్ బ్రాండ్ కూడా మహేష్ దగ్గరికే వెళుతుంటుంది. ఆయన సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్న సమయంలో కూడా ఆయన్ని ఆదుకుంది ఎండార్స్ మెంట్లే. అతిథి తర్వాత దాదాపుగా రెండున్నరేళ్ల పాటు మహేష్ సినిమాలు చేయలేదు. ఆ సమయంలో కేవలం ఎండార్స్ మెంట్లు చేస్తూ కోట్లు సంపాదించాడు మహేష్. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్నాక ఎండార్స్ మెంట్లు చేయడం మరింత ఎక్కువైంది. సూపర్ స్టార్ గా మహేష్ అవతరించడంతోపాటు, స్టైల్ ఐకాన్ గా యూత్ భావిస్తుండటంతో ప్రతీ బ్రాండ్ కూడా ఆయన దగ్గరికే వెళ్లింది. మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చేసే ప్రకటనల్ని కూడా అభిమానులు సినిమాల టైప్ లో కుతూహలంగా చూసే పరిస్థితొచ్చింది.
అయితే ఇప్పుడు మహేష్ బావ సుధీర్ బాబు కూడా బ్రాండ్లపై కన్నేశాడు. తాజాగా సుధీర్ హాల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. ఇటీవలే ఓ ప్రకటనలో కూడా నటించాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకొన్నాడు. హాల్స్ కంపెనీకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అలాంటి బ్రాండ్ కి సుధీర్ అంబాసిడర్ గా ఎంపిక కావడం గ్రేటే. ఇటీవల సుధీర్ హిందీలోకి ప్రవేశించాడు. జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ నటిస్తున్న భాగీ సినిమాలో సుధీర్ బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత సుధీర్ నిస్సందేహంగా జాతీయ స్థాయిలో పాపులర్ అవుతాడు. అందుకే హాల్స్ కంపెనీ సుధీర్ పై కన్నేసిందన్నమాట. ఇక నుంచి బావ బావమరదులు ఇద్దరూ బ్రాండ్ల తో బుల్లితెరపై సందడి చేస్తారన్నమాట.