‘బాహుబలి-2’ను ‘సింహాసనం’తో పోల్చిన అల్లుడు

Update: 2017-04-26 10:17 GMT
‘బాహుబలి’ సినిమాను తెలుగులో కానీ.. ఇండియాలో మరే భాషలో కానీ ఏ సినిమాతోనూ పోల్చడానికి వీల్లేదన్నది చాలామంది మాట. దీనికి వచ్చిన హైప్.. దీనికి జరిగిన బిజినెస్.. రిలీజ్ టైంలో హంగామా.. ఇది సాధించిన వసూళ్లు.. ఇలా ఏ విషయంలో అయినా దీనికి మరో సినిమాతో పోలిక తేలేం అంటున్నారు జనాలు. ఐతే సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. హీరో సుధీర్ బాబు మాత్రం ‘బాహుబలి’ని తన మావయ్య సినిమా ‘సింహాసనం’తో పోలుస్తున్నాడు.

ప్రస్తుతం బాహుబలి సినిమా విషయంలో నెలకొన్న అనూహ్యమైన క్రేజ్.. ఇది మన తెలుగు సినిమాకు గర్వకారణం అనే ఫీలింగ్.. ఇవన్నీ ఒకప్పుడు ‘సింహాసనం’ సినిమా టైంలోనూ కనిపించాయని అంటున్నాడు సుధీర్. తొలి 70 ఎంఎం సినిమా అని అప్పట్లో తెలుగు వాళ్లందరూ అప్పట్లో ‘సింహాసనం’ సినిమా గురించి ఎలా గర్వంగా ఫీలయ్యారో.. ఇప్పుడు ‘బాహుబలి’ విషయంలోనూ అలాగే ఫీలవుతున్నారని అన్నాడు సుధీర్ బాబు.

ఐతే దీనికి కొనసాగింపుగా సుధీర్ చేసిన ట్వీట్ కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక దిగ్గజం విషయంలో అగౌరవంగా ప్రవర్తించారంటూ ఫీలయ్యాడు సుధీర్. గొప్ప వ్యక్తిని గౌరవించడం నేర్చుకుని.. సరైన విలువ ఇవ్వాలని సుధీర్ అభిప్రాయపడ్డాడు. ఇది కృష్ణను ఉద్దేశించి అన్న మాటలేనా కాదా అన్నది అర్థం కాలేదు. కృష్ణ గురించే అయితే.. ఆయన్ని ఎవరు అగౌరవపరిచారు.. ఏ ఉద్దేశంతో సుధీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు అన్నదానిపై స్పష్టత లేకపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News