హీరో సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `వీ` ఫ్లాపయినా ఇంద్రగంటితోనే ఓ సినిమా చేస్తున్నారు. అలాగే `శ్రీదేవి సోడా సెంటర్` కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఆనంది కథానాయికగా నటిస్తోంది. మణి శర్మ సంగీతం అందిస్తుండగా సామ్ దత్ సైనూదీన్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు.
70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా -శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ క్లాస్ ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల గోదారి పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది.
అయితే సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ వీడియో అభిమానులకు షాకిస్తోంది. ఈ వీడియోలో ఏం ఉంది? అంటే.. ఒక నదిపై మరబోటు(తెప్ప)లో సుధీర్ బాబు ప్రయాణిస్తున్నారు. అతడి గెటప్ చూస్తుంటే కాస్త రంగస్థలం చిట్టిబాబులా రగ్గ్ డ్ గా గడ్డం పెంచి కండలు మెలి తిరిగి రఫ్ గా కనిపిస్తున్నాడు. అలా బోట్ వెళుతుంటే దానిపై కునుకేస్తున్నాడు. అంతేనా..! గోదారి మధ్యలో కునుకేస్తే సూపర్ పవర్స్ వస్తాయంటూ ట్వీటేశాడు.
ఇలాంటి సాహసానికే కళ్లు బైర్లు కమ్మేస్తుంటే ఏకంగా సూపర్ పవర్స్ వస్తాయి అంటూ చెప్పడమే వింత. ఇలాంటి చోట నిదురిస్తే అదో అఛీవ్ మెంట్ అన్నట్టే ఉంది అతడి వాలకం. అంతా బాగానే ఉంది కానీ.. ఆ పరిసరాలు కాస్త డేంజర్ గా కనిపిస్తున్నాయి. చూస్తుంటేనే పాత ఘటనలు గుర్తుకొచ్చి గగుర్పొడుస్తోంది. మరి సుధీర్ బాబు ధైర్యం ఏం చూసుకుని? అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఇక గోదారి లొకేషన్లలో శ్రీదేవి సోడా సెంటర్ షూటింగ్ సాగుతోంది కాబట్టి తెరనిండుగా నదీ అందాలతో ఎంతో ప్లెజెంట్ గా ఉంటుందని అర్థమవుతోంది.

Achieving sleep in middle of chaos should be considered as Superpower