ట్రెండీ ఫోటో: సుధీర్ బాబు న‌ట‌వార‌సుల్ని చూశారా?

Update: 2021-06-16 09:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త జంట‌కు ఇద్ద‌రు వార‌సులున్నారు. మాస్ట‌ర్ గౌత‌మ్ - బేబి సితార ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా సితార కు సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ అసాధార‌ణం. మ‌రి మ‌హేష్ బావ గారు సుధీర్ బాబుకు ఎంద‌రు వార‌సులు? అంటే.. ఆయ‌న‌కు ఇద్ద‌రు.

మ‌హేష్ సోద‌రి ప్రియ‌ద‌ర్శిని సుధీర్ బాబు 2006లో పెళ్లాడారు. పోసాని నాగ సుధీర్ బాబు అత‌డి పూర్తి పేరు. ప్ర‌స్తుతం వ‌య‌సు 41. చ‌రిత మాన‌స్ - ద‌ర్శ‌న్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. టాలీవుడ్ లో ఒక్కో మెట్టు విజ‌య‌వంతంగా ఎక్కుతున్న హీరోగా సుధీర్ బాబుకు పేరుంది. ఇక సుధీర్ బాబు లెగ‌సీని న‌డిపించే వార‌సులుగా చ‌రిత మాన‌స్.. ద‌ర్శ‌న్ ని ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా సుధీర్ బాబు త‌మ ఫ్యామిలీ ఫామ్ హౌస్ వెకేష‌న్ నుంచి కొన్ని ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో పాటు సుధీర్ బాబు - ప్రియ‌ద‌ర్శిని వారి వార‌సులు మాన‌స్ - ద‌ర్శ‌న్ ఉన్నారు. వారితో పాటే సీనియ‌ర్ నరేష్ ఉన్నారు. సుధీర్ బాబు చేతిలో ఒక చెవుల పిల్లి కూడా ఉంది.

ఇంత‌కీ ఇది ఏ ఫామ్ హౌస్? అంటే గ‌చ్చిబౌళి ఫైనాన్షియ‌ల్ జిల్లా ప‌రిస‌రాల్లో సూప‌ర్ స్టార్ కృష్ణ నివ‌శించే ఫామ్ హౌస్ ఉంది. అలాగే సుధీర్ బాబు హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోని ఓ తోట‌లో ఇండివిడ్యువ‌ల్ ఇంట్లో నివ‌సిస్తున్నారు. అలాగే కృష్ణ‌కు ఊటీలోనూ ఒక ఫామ్ హౌస్ ఉంది. మామిడి తోట‌లో ఆయన గెస్ట్ హౌస్ ఉంది. మ‌రి ఈ ఫోటో వీటిలో ఎక్క‌డి నుంచి అన్న‌ది సుధీర్ బాబు వెల్ల‌డించాల్సి ఉంది. కుటుంబంతో ఇలా గ‌డ‌ప‌డం గ్రేట్ అంటూ సుధీర్ బాబు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

అన్నా.. మీ అబ్బాయి నీ అంత అయిపోయాడు.. ఎప్పుడు మరి సినిమాలోకి రావడం? మేనమామ (మ‌హేష్‌) పోలికలు వచ్చినట్లు ఉన్నాయి..మరో సూపర్ స్టార్ అవ్వాలి..!! అంటూ ఓ అభిమాని ఈ ఫోటోలకు రిప్ల‌య్ ఇవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.
Tags:    

Similar News