నిర్మాణ దశ నుంచే ఆసక్తి రేపుతున్న మల్టీ స్టారర్ వీరభోగ వసంత రాయలులో సుధీర్ బాబు లుక్ విడుదలైంది. ఇప్పటికే నారా రోహిత్-శ్రీవిష్ణు-శ్రేయ శరన్ లుక్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా సుధీర్ కూడా వాళ్ళ సరసన చేరిపోయాడు. కల్ట్ ఈజ్ రైజింగ్ క్యాప్షన్ తో వదులుతున్న స్టిల్స్ లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. నల్ల కళ్ళద్దాలతో ఇరు వైపులా ఎర్రని తీగలు కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుండగా దేని కోసమో వెతుకుతున్న కసి సుధీర్ ఎక్స్ ప్రెషన్ లో కనిపిస్తోంది. యూనిట్ ముందు నుంచి ఊరిస్తున్నట్టుగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్ లో లుక్ లేదు కాని కథకు సంబంధించిన ఏ చిన్న క్లూ లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టు కనిపిస్తోంది. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే డేట్ అనౌన్స్ చేయబోతున్నారు.
సుధీర్ బాబు ఇటీవలే వచ్చిన సమ్మోహనం హిట్ తో మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వీరభోగవసంత రాయలు దానికి భిన్నమైన జానర్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందటంతో దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. పాత్ర ఏంటి దాని తీరుతెన్నులు తదితర వివరాలు టీజర్ వచ్చాక కానీ అవగాహనకు రాలేం. సుధీర్ బాబు లుక్ ని ఆఖరులో విడుదల చేయటం చూస్తుంటే అందరికంటే కీలకమైన పాత్ర ఇతనిదేమోనన్న అనుమానం కలుగుతోంది. టైటిల్ లో చెప్పిన వసంత రాయలు రోహితా లేక సుధీరా అన్న సస్పెన్స్ తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది కాకుండా సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సైతం విడుదలకు సిద్దంగా ఉంది. అది వచ్చాకే వీరభోగవసంత రాయలు వచ్చేలా ఉన్నాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టైటిల్ లో ఉన్న వీర-భోగ-వసంత-రాయలు పేర్లు నాలుగు పాత్రలవని తెలిసింది. నిజమో కాదో లెట్ వెయిట్ అండ్ సీ.