మ‌రో సిట్టి బాబు అవుతాడా ఏంటీ?

Update: 2020-11-03 04:30 GMT
తెలుగు సినిమాల్లో గోదారి యాస‌కు ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. రంగ‌స్థ‌లం చిత్రంలో గోదారి యాస భాష సంస్కృతిని అచ్చు గుద్దిన‌ట్టు చూపించాడు సుక్కూ. సిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ గోదారి యాస‌ను ప‌లికించిన తీరుకు బోలెడ‌న్ని ప్ర‌శంస‌లు దక్కాయి. నిజానికి తెలుగు సినిమాల్లో అస‌లు గోదారి యాస అన్నది కొత్తేమీ కాదు. జమానా కాలం నుంచి స్టార్ డైరెక్ట‌ర్లు రైట‌ర్లు వినిపియోగిస్తున్న ప‌రిచ‌ర్య ఇది.

ఇక యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఇప్పుడు మ‌రో సిట్టిబాబుగా మారి గోదారి యాసను ప‌లికించ‌నున్నాడ‌న్న‌ది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ బాబు ఇటీవల `పలాస 1978` ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టుపై సంతకం చేశారు. `శ్రీదేవి సోడా సెంటర్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం గత వారం దాని మోషన్ పోస్టర్ ‌ను ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిన‌దే.

ఈ చిత్రంలో గోదావరి విలేజీ కుర్రాడిగా క‌నిపిస్తాన‌ని.. తన పాత్రకు మరింత ప్రామాణికతను తీసుకురావడానికి గోదావరి మాండలికాన్ని నేర్చుకుంటున్నానని సుధీర్ బాబు తాజా ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం ప్రేమకోసం ఫైట్ .. ఆధిపత్యం పోరాటం నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. మ‌నిషిలోని ర‌క‌ర‌కాల‌ భావోద్వేగాలను ర‌గిలిస్తుంద‌ట సుధీర్ పాత్ర‌.

సుధీర్ స్నేహితులు విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ క్రింద ఈ ప్రాజెక్టును నిర్మించ‌నున్నారు. ఈ నెలలో షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. `వి` ఫ‌లితం ఆశించినంత రేంజుకు చేర‌క‌పోవ‌డంతో సుధీర్ బాబు ఈసారి మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట.
Tags:    

Similar News