విలన్ గా చేస్తే తప్పేంటి -మహేష్ బావ

Update: 2015-12-25 06:18 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా, ప్రత్యేకమైన కథాంశాలు ఎంచుకుని గుర్తింపు దక్కించుకున్నాడు సుధీర్ బాబు. అతని యాక్టింగ్ స్కిల్స్.. ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ ని కూడా తెచ్చిపెట్టాయి. అయితే హిందీ సినీరంగం నుంచి పిలుపు వచ్చింది మాత్రం విలన్ రోల్ కి. అయినా సరే ఏ మాత్రం జంకకుండా యాక్సెప్ట్ చేసేశాడు సుధీర్.

బాలీవుడ్ మూవీ బాఘీలో సుధీర్ బాబు ప్రతినాయకుడి రోల్ చేస్తున్నాడు. సబ్బీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఆఫర్ కోసం ఎవరినీ అప్రోచ్ కాకుండానే.. యూట్యూబ్ - ఫేస్ బుక్ పోస్ట్ లలో సుధీర్ స్కిల్ చూసి, డైరెక్టుగా వారే వచ్చి విలన్ రోల్ చేయమని అడగం విశేషం. కేరళ మార్షల్ ఆర్ట్స్ థీమ్ తో ఈ స్టోరీ సాగుతుంది. అయితే.. సాధారణంగా హీరోగా కంటిన్యూ అవుతున్న సమయంలో, విలన్ రోల్స్ చేసే కల్చర్ టాలీవుడ్ లో లేదు. ఇది పెద్ద రిస్క్ అని కూడా చెబుతుంటారు.

దీనికి సుధీర్ దగ్గర పెద్ద ఆన్సరే ఉంది. 'ఏ మాయ చేశావే చిత్రంలో చిన్న సైజ్ విలన్ రోల్ చేశాను. అది బాగానే క్లిక్ అయింది. ఆ తర్వాత హీరోగా చేస్తున్నాను. అలాంటప్పుడు బాలీవుడ్ లో మాత్రం విలన్ రోల్స్ చేస్తే తప్పేంటి ' అంటున్నాడు సుధీర్. ఫిబ్రవరి వరకూ బాఘి షూటింగ్లో బిజీ కావడంతోనే.. తెలుగు చిత్రాలను అంగీకరించడం లేదట. ఇక.. సుధీర్ బాబు నటించిన భలేమంచి రోజు చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఇవాళే రిలీజ్ అయింది. ఉదయం 8నుంచి రాత్రి 8 వరకు సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి.
Tags:    

Similar News