కింగ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్ నటశిక్షణ కోసం న్యూయార్స్ ఫిలిం అకాడెమీలో చేరిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా న్యూయార్క్ టు ముంబై ప్రయాణాలతోనే గత ఏడాది బిజీగా ఉండేది. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారీ బెంబేలెత్తించడంతో ఇటీవల పూర్తిగా ముంబైలో సెటిలై ప్రయాణాలకు దూరమైంది.
తాజా సమాచారం ప్రకారం.. సుహానా ఖాన్ తిరిగి న్యూయార్క్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన కళాశాల లైబ్రరీ నుండి ఇన్ స్టాగ్రామ్ లో ఒక చిత్రాన్ని షేర్ చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా సుహానా సంవత్సరంలో ఎక్కువ భాగం తన కుటుంబంతో ముంబైలోనే గడిపారు. తాజాగా షేర్ చేసిన ఫోటోకి వ్యాఖ్య లు ఒకట్రెండు కనిపిస్తున్నాయి. మీరు చాలా అందంగా ఉన్నారు అని ఒక వ్యక్తి ఆ పోస్ట్ యొక్క వ్యాఖ్యల విభాగంలో రాసారు. ఇది ఆమె బంధువు అలియా చిబా.. ఆమె స్నేహితురాలు షానయ కపూర్ సుహానా ‘నడువొంపు సోయగం` పై అసూయను వ్యక్తం చేసింది.
సుహానా తరచూ తన కళాశాల నుంచి రకరకాల ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయడం చూస్తున్నదే. అయితే గత సంవత్సరం ముంబై లైఫ్ కి సంబంధించిన ఫోటోలే అధికంగా షేర్ చేసింది. తన కుటుంబంతో కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ కోసం అప్పట్లో సుహానా యుఎఇకి వెళ్ళింది.
తన రంగును విమర్శించిన నెటిజనులతో గొడవ వల్లనా హెడ్ లైన్స్ లో చేరింది. తన గోధుమ రంగును విమర్శించిన వారికి సరైన సమాధానం ఇచ్చింది. నా స్కిన్ టోన్ కారణంగా 12 సంవత్సరాల వయస్సు నుండి వివక్షణ ఎదుర్కొంటున్నానని .. నన్ను ఆడా మగా అంతా అసహ్యించుకున్నారని సుహానా బహిరంగంగా వ్యాఖ్యానించింది.
సుహానా చదువు పూర్తయ్యాక చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎదగాలని భావిస్తున్నారు. పాపా షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “సుహానా నటిగా ఉండాలంటే మరో మూడు నాలుగు సంవత్సరాలు నటన నేర్చుకోవాలి. నా పిల్లలు రేపు నటించడం ప్రారంభించాలని నా పరిశ్రమ స్నేహితులు కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ నా వారసులు ఇంకా నటించడం ప్రారంభించకూడదనే భావిస్తాను`` అని అన్నారు. దానిని బట్టి సుహానా పూర్తిగా సుశిక్షితురాలు అయ్యేవరకూ నటనలో ప్రవేశించడని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.