నెపోటిజం హీట్ సుహానా కు గట్టిగా తగిలింది!

Update: 2018-08-03 03:30 GMT
ఇంతకుముందులా ఏది చెప్తే అది వినేందుకు జనాలు రెడీగా లేదు. ఒక్క పత్రిక చదివి అభిప్రాయాలు ఏర్పరుచుకునే అమాయక ప్రజలు ఇప్పుడున్నారనుకుంటే.. అది వాళ్ళని మోసం చెయ్యాలనుకునే వాళ్ళ అమాయకత్వమే తప్ప మరోటి కాదు.  ఈమధ్య బాలీవుడ్ బాద్షా గా పేరు తెచ్చుకున్న కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు ప్రఖ్యాత 'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ పై తళుక్కున మెరిసింది.  అది సాధారణంగా అయితే ఓ గొప్ప అఛీవ్ మెంట్.. కష్టపడి పైకొచ్చి ఆ కవర్ పేజ్ పై మెరిసిన వాళ్ళకు మాత్రమే దాని విలువ సరిగ్గా తెలుస్తుంది.  అలాంటిది, సుహానా అలా అలవోకగా ఆ అవకాశం సాధించడం చాలామందికి నచ్చలేదు.

అంతే... చెలరేగి పోయి అందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టడం మొదలు పెట్టారు.  అసలు సుహానా కంటే అందమైన వాళ్ళు లేరా? ఆమె కంటే మోడలింగ్ లో మెరుగైన వారు లేరా అంటూ వోగ్ తాట పెరుకుతూ నెటిజనులు 'నేపోటిజం' కు ఇది పరాకాష్ట అంటూ మంచి హిందీ లో - పాలిష్డ్ ఇంగ్లీష్ లో పచ్చి బూతులు తిట్టారు.   షారూఖ్  ఖాన్ కూతురు కాకపొతే ఎవరైనా కనీసం సుహానాను పట్టించుకునే క్వారా అంటూ దుమ్మెత్తిపోశారు.  అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు ఈ దాడికి దిగడం విశేషం.  'వోగ్' సోషల్ మీడియా పేజ్ లో వాళ్ళకు చుక్కలు చూపించారు.  దెబ్బతో వోగ్ వాళ్ళకు ఏమి చేయాలో అర్థం కావాలో అర్థం కాక సోషల్ మీడియా లో 'కామెంట్స్' ను డిజేబుల్ చేయడం విశేషం. 

ఎదేతేనేం.. ఈ ఎపిసోడ్ మొత్తానికి కావలసినంత ప్రచారం లభించింది. ఇవన్నీ సుహానా బాలీవుడ్ డెబ్యూ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించలేవు కానీ ఈ హంగామా మాత్రం కింగ్ ఖాన్ మాత్రం అసలు ఊహించి ఉండడు.
Tags:    

Similar News