మళ్ళీ చూడమంటే ఎలా సుజిత్?

Update: 2019-09-03 11:22 GMT
ఏ దర్శకుడికైనా క్లారిటీ చాలా అవసరం. తాను చెప్పాలనుకున్న కథ రాసుకున్న విధానం స్పష్టంగా ఉంటే ఏ వర్గం ప్రేక్షకుడైనా ఈజీగా కనెక్ట్ అవుతాడు. అలా కాకుండా మన మేధావితనం మొత్తం తెరమీద చూపించేసి అర్థం కాకపోతే ఇంకోసారి చూసి తరించండి అని చెప్పడం ప్రేక్షకుల అవగాహనా శక్తిని తక్కువ అంచనా వేయడమే. సాహో దర్శకుడు సుజిత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. అంతటా నెగటివ్ టాక్ తెచ్చుకున్న సాహో వీకెండ్ హాలిడేస్ పుణ్యమా అని మంచి వసూళ్లను నమోదు చేస్తోంది కానీ ఆశించిన రేంజ్ లో టాక్ మాత్రం పాజిటివ్ గా మారడం లేదు.

ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు మలచడంలో సుజిత్ ఫెయిల్ అయ్యాడని సోషల్ మీడియా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ సుజిత్ మాత్రం అలాంటిదేమి లేదన్న తరహాలో ట్వీట్ చేస్తున్నాడు.  కొంత ఎమోషన్ ని మిక్స్ చేసిన ట్వీట్ లో షార్ట్ ఫిలింస్ తీసే స్థాయి నుంచి ఇంత పెద్ద కాన్వాస్ ఉన్న సినిమాను పాన్ ఇండియా లెవెల్ టేకప్ చేయడం దాకా తన ప్రయాణం గొప్పగా సాగిందని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడా ఆగలేదని చెప్పాడు.

అంతే కాదు సాహో నుంచి చాలా ఆశించారని మరోసారి సినిమా చూస్తే అనుమానాలు తొలగిపోయి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అంటే మొదటిసారి చూసి బాలేదు లేదా అర్థం కాలేదు అని చెప్పిన వాళ్ళు అమాయకులనా. ఫస్ట్ టైం చూసి ప్రేక్షకుడిని మెప్పించినప్పుడే వద్దన్నా రెండోసారి చూస్తాడు. అలాంటిది ఒకసారి చాలు మహాప్రభో అన్న వాళ్ళను ఇంకోసారి చూస్తే బాగుంటుంది అని చెప్పడం ఏమిటో మరి


Tags:    

Similar News