సినిమా అనేది సామాన్య జనాలకు వినోదం అయితే.. సినిమా కోసం పని చేసేవాళ్లకు అది జీవితం.. మొన్న ‘ట్యాక్సీవాలా’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ నొక్కి వక్కాణించిన మాట ఇది. ఒక సినిమా కోసం కొందరు ఎంత కష్టపడతారో.. ఎలా ప్రాణం పెట్టి పని చేస్తారో విజయ్ ఆ సందర్భంగా వివరించాడు. ఈ చిత్రానికి పని చేసిన ఒక్కొక్కరు ఎన్ని త్యాగాలు చేసింది.. ఏ పరిస్థితుల్లో ఈ సినిమా చేసింది అతను వివరించాడు.
ఆ సందర్భంగా కెమెరామన్ సుజీత్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అతను ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ విషయాన్ని గుర్తు చేశాడు. తాజాగా సుజీత్ అప్పటి తన పరిస్థితి గురించి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది.
‘ట్యాక్సీవాలా’కు పని చేస్తుండగా.. సుజీత్ కు మెడకు సంబంధించిన అనారోగ్యంతో కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందట. ఒక దశలో మెడ నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ ఈ ప్రొఫెషనే వదిలేయమని స్పష్టం చేశాడట. కానీ అలాంటి స్థితిలోనూ మెడకు పట్టీ వేసుకుని.. కొన్ని రోజులకే ఆసుపత్రి నుంచి వచ్చేసి ‘ట్యాక్సీవాలా’ పూర్తి చేశాడట సుజీత్. అంత నొప్పిని భరిస్తూ.. 20 కిలోల బరువుండే కెమెరాను మోస్తూ చిత్రీకరణ జరిపాడట. షూటింగ్ లొకేషన్ నుంచి మెడకు పట్టీతో దిగిన ఫొటోలు అతను షేర్ చేశాడు. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలు.. ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం తనకిష్టముండదని.. కానీ ‘ట్యాక్సీవాలా’ సినిమాను పైరసీ చేసి లీక్ చేయడం తీవ్ర ఆవేదన కలిగించిందని.. ఒక సినిమా వెనుక ఎంతటి కష్టాలుంటాయో.. దీని కోసం కొందరు జీవితాల్ని ఎలా పణంగా పెడతారో తెలియజెప్పేందుకు ఈ పోస్ట్ పెడుతున్నట్లు అతను వివరించాడు. దయచేసి ‘ట్యాక్సీవాలా’ సినిమాను థియేటర్లలో చూడాలని.. ఇది జనాల్ని ఏమాత్రం నిరాశ పరచదని అతను చెప్పాడు.