బాలు జయంతి రోజున సుక్కు పాత వ్యాఖ్యలు వైరల్‌

Update: 2021-06-06 08:30 GMT
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాలు.. ఆయన పాటల్లోనే అభిమానులు బతికేస్తున్నారు. ఆయన మరణంను ఇంకా జీర్ణించుకోలేని వారు ఎంతో మంది. ఆయన మృతి తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజున సినీ ప్రముఖులు పలువురు వర్చువల్‌ ద్వారా మీడియాతో మాట్లాడుతూ తమ అనుబంధంను గురించి నెమరవేసుకున్నారు. ఆయన పాడిన పాటల తాలూకు మాధుర్యంను జయంతి రోజున సినీ ప్రముఖులు వివరిస్తూ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో చాలా ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ పాడుతా తీయగా షో లో మాట్లాడిన మాటలు కూడా జయంతి రోజున వైరల్‌ అయ్యాయి.

పాడుతా తీయగా  షో లో ఒకానొక సందర్బంలో సుకుమార్‌ గెస్ట్‌ గా హాజరు అయ్యాడు. ఆ సమయంలో సుకుమార్‌ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి పాటలతో గడిచి పోయిందన్నాడు. అన్ని వయసుల్లో కూడా ఆయన పాటల నాకు జీవితంలో భాగస్వామ్యం అయ్యయి. ఆయన ఒక పాటను అయిదు నిమిషాల్లో పాడి వెళ్లి పోతారు. కాని ఆ పాట ఆ తర్వాత ఎంతగా ప్రభావం చూపుతుందో విన్న వారికే తెలుసు. ఒక్కో పాట ఎంతో మంది జీవితాలపై బలమైన ముద్రను వేస్తుందన్నాడు.

ఒక్కో పాటను మళ్లీ మళ్లీ వింటూ ఉంటాం. ఆయన పాటలతో జీవితం సాగించడం అంటే ఆ రంకంగా బాలు గారు వేరే వారి జీవితాలను కూడా జీవిస్తున్నారు అన్నాడు. ఆ మాటలకు బాలు చాలా సంతోష పడ్డారు. ఆయన స్పందిస్తూ ఇలాంటి ప్రశంసలు ఎప్పుడు వినలేదు. ఇది నా జీవితంలో అతి పెద్ద కాంప్లిమెంట్‌. పది పద్మభూషన్ లతో ఇది సమానం అన్నట్లుగా బాలు ఆ సందర్బంలో అన్నారు. సుకుమార్‌ మాత్రమే కాకుండా ప్రముఖ దర్శకులు ఇతర సినీ టెక్నీషియన్స్‌ అందరికి అభిమానులకు ఇలా ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆరాధ్య దైవం. అందుకే ఆయన మృతి చెంది ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం... మరో పాతిక సంవత్సరాలు అయినా మాట్లాడుకుంటూనే ఉంటాం.
Tags:    

Similar News