సమంత వచ్చాక సుక్కును పట్టించుకోవట్లేదట

Update: 2018-10-25 09:44 GMT
అక్కినేని నాగచైతన్యతో తన బంధాన్ని సమంత కట్ చేసేసిందన్నట్లుగా మాట్లాడుతున్నాడు అగ్ర దర్శకుడు సుకుమార్. సమంత వచ్చాక చైతూ తనతో కలవట్లేదని ఆయన అన్నాడు. చైతూ హీరోగా నటించిన కొత్త సినిమా ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుక్కు.. తాను చైతూ కలిసి ‘100 పర్సంట్ లవ్’ సినిమా చేశాక మంచి మిత్రులయ్యామన్నాడు. ఆ తర్వాత తరచుగా కలిసేవాళ్లమని.. కానీ ఏడాది కాలం నుంచి చైతూ తనను కలవట్లేదని అన్నాడు. సమంత అతడి జీవితంలోకి వచ్చాకే అతడిని కలిసి అవకాశం ఉండట్లేదని.. 100 పర్సంట్ ఉన్న తమ బంధంలో ఒక శాతాన్ని సమంత తీసుకెళ్లిపోయిందని చమత్కరించాడు సుక్కు.

ఇక ‘సవ్యసాచి’ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు ఈ కథ తెలుసని.. తెలుగు సినిమాల్లోనే కాదు.. మొత్తం ఇండియన్ స్క్రీన్ మీదే ఇలాంటి కథ రాలేదని సుక్కు చెప్పాడు. ఏ దర్శకుడైనా ఇలాంటి కథతో సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తాడని.. ఈ విషయంలో చందూ మొండేటిని చూస్తే తనకు అసూయగా ఉందని అన్నాడు సుక్కు. హీరో ఎడమ చేయి అతడి మాట వినదు అంటే.. అది చాలా ఆసక్తి రేకెత్తించే పాయింట్ అని.. ఈ పాయింట్‌ తో అద్భుతమైన కామెడీ పండించొచ్చని.. ఎన్నో సమస్యలు సృష్టించవచ్చని.. కాన్ఫ్లిక్ట్ కు మంచి అవకాశం ఉంటుందని సుక్కు అన్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుందని కూడా చెప్పాడు. సినిమాలో చైతూ స్క్రీన్ ప్రెజెన్స్  అదిరిందని.. చాలా అందంగా కనిపిస్తున్నాడని చెప్పాడు. సంగీత దర్శకుడు కీరవాణి ఒక మేధావి అని.. ఆయన గురించి తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ గొప్పగా చెబుతాడని.. ఒక సంగీత దర్శకుడి గురించి మరో సంగీత దర్శకుడికే తెలుస్తుందని.. ‘సవ్యసాచి’ పాటలు.. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయని అన్నాడు సుక్కు.


Tags:    

Similar News