`రంగస్థలం`తో తన పంథాని మార్చుకున్నారు సుకుమార్. అంతకు ముందు ఆయన చేసిన సినిమాకు మించి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. తనలో అబ్బుర పరిచే నటుడు వున్నాడని ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పుడు ఇదే పంథాని అనుసరిస్తూ సుకుమార్ చేసిన చిత్రం `పుష్ప`.
రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఐదు బాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఊహించని స్థాయిలో `పుష్ప ది రైజ్` అఖండ విజయాన్ని సాధించడంతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారుసుకుమార్. ఇటీవల అత్యంత సన్నిహితులతో కలిసి పార్టీలు చేసుకుని సక్సెస్ ని ఎంజాయ్ చేసిన సుకుమార్ తాజాగా ఓ తమిళ ఛానల్ కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని, ఆయనని కలిసిన ఓ సందర్బాన్ని.. ఆ సమయంలో తను ఎదుర్కోన్న మర్చిపోలేని ఓ గోల్డెన్ మూమెంట్ ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రజనీని కలవాలని `రోబో` చిత్రీకరణ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లారట సుకుమార్ ఆ సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్పుకొచ్చారు సుకుమార్.
`అవి రోబో చిత్రీకరణ జరుగుతున్న రోజులవి. ఆ షూటింగ్ చూద్దామని లొకేషన్ కి వెళ్లా. నేను తీసిన `ఆర్య` సినిమా చూసిన రజనీ సర్ నన్ను పలకరించడానికి నాదగ్గరకు వచ్చారు. రజనీ సర్ నా దగ్గరకు రాగానే వణుకుతూ ఆయన చేతులు పట్టుకుని సర్ .. సర్.. అంటున్నాను. అది గమనించిన ఆయన నా దగ్గరకు వచ్చి కూర్చోండి అన్నారు. `ఆర్య` లో హీరోయిన్ హెయిర్ ఊడుతూ పడిపోయే సీన్ బాగుందని అభినందించారు.
అయితే ఈ లోగా ఆయన షాట్ రెడీ అనగానే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే లేచి నిలబడ్డాను. వెంటనే ఆయన కూర్చోండి అన్నారు. అయినా నేను కూర్చోకపోయే సరికి నా కోసం ఆయనే స్వయంగా కకుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చోబెట్టారు. డైరెక్టర్ అంటే ఆయనకు అంత గౌరవం. సూపర్ స్టార్ అయినా ఇప్పటికీ ఒదిగే వుంటారు. రజనీ నాకు కుర్చీ తీసుకొచ్చి వేసిన సందర్భాన్ని నా లైఫ్ లో జరిగిన ఓ గోల్డెన్ మూమెంట్ గా భావిస్తున్నాను. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను` అని `రోబో` నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు సుకుమార్.