ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆక్సీజన్ అందక, మందులు లభించక ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సుకుమార్.
ఈ డబ్బుతో ఏపీలోని బాధితులకు ఆక్సీజన్ సిలిండర్లు, కాన్ సన్ ట్రేటర్లు అందించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తన మిత్రులతో కలిసి అత్యవసరంగా నాలుగు ఆక్సీజన్ సిలిండర్లను అందించినట్టు సమాచారం. మరోమూడ్నాలుగు రోజుల్లో మిగిలిన సిలిండర్లు, కాన్ సన్ ట్రేటర్లు సరఫరా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
దేశంలో నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు తన వంతు సహాయం అందించేందుకు సుకుమార్ ముందుకు రావడం హర్షణీయమని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుక్కూను స్ఫూర్తిగా తీసుకొని టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కొవిడ్ బాధితులను ఆదుకోవాలని కోరారు.