రంగస్థలం.. రాజమౌళి చెప్పిన రోజొచ్చింది

Update: 2018-03-29 14:30 GMT
ఆ జోనర్.. ఈ థీమ్.. ఆ కాన్సెప్ట్.. ఈ సబ్జెక్ట్.. ఇలా ఎన్నిరకాలుగా చెప్పినా.. సింపుల్ గా వర్గీకరిస్తే.. సినిమాలు రెండు రకాలు. ఒకటి క్లాస్.. మరొకటి మాస్.. అంతే. వీటిలోనే తమకు పట్టు ఉన్న కోణంలో మాంచి ఎమోషన్స్ ను పండిస్తూ సినిమాలను చేస్తుంటారు దర్శకులు. అయితే.. ఒక దర్శకుడు మరొక దర్శకుడిని పొగడడం అనే విషయం ఈ మధ్య తరచుగా కనిపిస్తోంది.

ఇప్పుడు రంగస్థలం మూవీ రిలీజ్ సందర్భంగా.. గతంలో రాజమౌళి చెప్పిన ఓ మాటల గురించి గుర్తు చేసుకుంది. ఒకట్రెండు సందర్భాలలో ఇతర దర్శకులతో పోలిక వచ్చినపుడు జక్కన్న ఇలా చెప్పుకొచ్చాడు. 'నేను.. వినాయక్.. త్రివిక్రమ్.. సుకుమార్.. మేమందరం ఎవరి పద్ధతిలో వారు సినిమాలు చేస్తున్నాం. ఒకరితో ఒకరికి పోలిక పెట్టడం కష్టం. మేము మాస్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాం. కానీ వీరిలా నేను ఎప్పటికీ సినిమా చేయలేను అని.. ఓ ఇధ్దరిని చూస్తే అనిపిస్తుంది. త్రివిక్రమ్.. సుకుమార్.. వీరిద్దరి మాదిరిగా ఎప్పటికీ నేను సినిమా చేయలేను. వాళ్లు కనుక మాస్ మూవీస్ చేయడం మొదలుపెడితే.. నాలాంటి వాళ్లు సర్దుకోవాల్సిందే' అని ఓ ఇంటర్వ్యూలోనే కాదు.. ఒకానొక పబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పిన రాజమౌళి.. సుకుమార్ తీసిన ఆర్య2 మూవీలోని సీన్ ని.. తాను మర్యాద రామన్నలో కాపీ కొట్టకుండా ఉండలేకపోయానని అన్నాడు.

ఇన్నేళ్లూ క్లాస్ టచ్ ఉన్న మూవీస్ చేస్తూ వచ్చిన సుకుమార్.. ఇప్పుడు రంగస్థలం మూవీని ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టెయినర్ గా.. తీశాడనే సంగతి తెలిసిపోతోంది. మరి జక్కన్న చెప్పినట్లుగా మాస్ మూవీ కోసం సుకుమార్ తన సర్వశక్తులు ఒడ్డడం చూస్తే.. రాజమౌళి చెప్పిన రోజు వచ్చేసింది కదా అనిపించక మానదు.
Tags:    

Similar News