మరీ మైఖేల్‌ జాక్సన్‌ అంత కాదులే

Update: 2015-11-17 19:30 GMT
ఒక పెద్ద మాటన్నాడు దర్శకుడు సుకుమార్‌. తనకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ మీద ఎంత ప్రేమ ఉందో.. తిట్టాడో పొగిడాడో అన్నచందంగా ఒక కామెంట్‌ చేశాడు. కాని కామెంట్‌ ఎలాగున్నా కూడా అందులో కంపారిజన్‌ మాత్రం మ్యూజిక్‌ లవర్స్‌ కు అస్సలు నచ్చట్లేదు.

''నేను మైఖేల్‌ జాక్సన్‌ ను.. దేవిశ్రీప్రసాద్‌ ను.. గ్రేట్‌ అనను. ఎందుకంటే వారిలో వారసత్వపు జీన్స్‌ ఉంది. దేవిశ్రీ నాన్నగారు రైటర్‌ కాబట్టి.. దేవి కూడా ఈజీగా పాటల లిరిక్స్‌ రాస్తున్నాడు'' అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్‌. అంటే దేవిశ్రీ సంగీతం బాగోదా అంటే.. ''అబ్బే.. నీరు ప్రవహిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. దేవి సంగీతం సూపర్‌'' అంటూ ఒక యునివర్సల్‌ స్టేట్ మెంట్‌ తో లింక్‌ చేశాడు. దేవిశ్రీని ఎలా పొగిడినా ఓకె.. కాని మైఖేల్‌ జాక్సన్‌ ను సుక్కూ కామెంట్‌ చేసిన తీరు మ్యూజిక్‌ లవ్వర్లకు అస్సలు నచ్చట్లేదు. అసలు దేవిశ్రీ రేంజ్‌ వేరు మైఖేల్‌ జాక్సన్‌ రేంజ్‌ వేరు.. కంపేర్‌ చేయకూడదు. కాని మనోడు కంపేర్‌ చేసేశాడు కాబట్టి.. అసలు గ్రేట్‌ కాదు అనే కామెంటులో ఎంత వాస్తవికత అనేది ఉందో జనాలు చూస్తున్నారు.

మైఖేల్‌ జాక్సన్‌ అంటే ఒక తరంగం. వాళ్లమ్మగారు పాటలు పాడదామని అనుకుని.. కుదరక ఒక డిపార్టమెంటల్‌ స్టోరులో పనిచేశారు. ఇక మైఖేల్‌ నాన్నగారు కూడా హార్డ్‌ జాబ్స్‌ చేస్తూ.. అప్పుడప్పుడూ ఒక ట్రూప్‌ లో గిటార్‌ వాయించేవారు. కాని వీళ్లగురించి వాళ్ల వీధిలో కూడా అందరికీ తెలిసుండదు. బట్‌ యం.జె. అనే రెండు అక్షరాలు తెలియని వీధి ఈ ప్రపంచంలో ఉంటుందా.. అదంతా తండ్రి జీన్స్‌ వలనే అంటే ఎలా సుక్కూ సార్‌??
Tags:    

Similar News